న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs AUS: హ్యాట్రిక్ ఓటములు.. ఆస్ట్రేలియా కోచ్‌పై వేటు తప్పదా?

WI vs AUS: Will Cricket Australia Remove Justin Langer As Head Coach?

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఎన్నడూ లేని విధంగా వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరవుతుంది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో మరో రెండు మ్యాచ్‌లుండగానే సిరీస్‌ను కోల్పోయింది. దాంతో ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఇద్దరిని తప్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీమ్ హెడ్‌కోచ్‌గా జస్టిన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆస్ట్రేలియా టీమ్ సత్యనాశనమైందని ఘాటుగా విమర్శిస్తున్నారు. విదేశీ గడ్డపై విజయాలు దేవుడెరుగు.. కనీసం సొంతగడ్డపై సిరీస్‌లు కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని కామెంట్ చేస్తున్నారు.

18 ఓటములు.. 13 విజయాలు..

జస్టిన్ లాంగర్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియా పెర్ఫామెన్స్‌కు సంబంధించిన లెక్కలను బయటకు తీసి మరి విమర్శలు గుప్పిస్తున్నారు. లాంగర్ పర్య వేక్షణలో ఏడు టెస్ట్‌ సిరీస్‌లు ఆడితే ఆసీస్ మూడు గెలిచి, మూడు ఓడింది. ఒకటి డ్రా అయింది. ఇందులో భారత్ చేతిలో ఓడిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సైతం ఉంది.

ఈ సిరీ స్ అనంతరమే లాంగర్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టును ఆస్ట్రేలియా ఓడించలేకపోయింది. వన్డేల్లో 11 మ్యాచ్‌లు ఆడగా.. 5 గెలిచి 6 ఓడింది. టీ20ల్లో 15 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో తొమ్మిదింటిలో ఓడింది. ఒకటి ఫలితం తేలలేదు. ఓవరాల్‌గా 33 మ్యాచ్‌ల్లో 18 ఓటములు, 13 విజయాలు నమోదు చేసింది

విండీస్ పర్యటనలో చిత్తు..

డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండానే విండీస్ పర్యటనకు వెళ్లిన ఆసీస్ దారుణంగా విఫలమవుతుంది. కనీసం పోరాట పటిమ కనబర్చలేపోతుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతుంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ వైఫల్యం, టీమ్‌మేనేజ్‌మెంట్ పసలేని వ్యూహాలు ఆ జట్టు కొంపముంచుతున్నాయి.

మూడు టీ20లో 6 వికెట్లతో చిత్తయిన ఆసీస్.. సెకండ్ మ్యాచ్‌లో 56 పరుగులతో, తొలి టీ20లో 18 పరుగులతో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే కోచ్‌గా లాంగర్ వైఫల్యమే ఈ వరుస ఓటములకు కారణమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

పాంటింగ్‌కు బాధ్యతలు ఇవ్వాలి..

ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు టీ20 క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాయని, ముఖ్యంగా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారని, కానీ ఆస్ట్రేలియా మాత్రం సీనియర్ ప్లేయర్లపై ఆధారపడుతుందంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌కు హెడ్ కోచ్‌గా అవకాశమివ్వాలని సూచిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా పాంటింగ్ తన పనితీరును క్రికెట్ ప్రపంచానికి చాటాడని, అతనితోనే ఆస్ట్రేలియా క్రికెట్‌లో మార్పు వస్తుందంటున్నారు. ఈ తరహా ప్రదర్శనలతో టీ20 ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని, ఆసీస్ రాబోయే కాలంలో మూడు ప్రపంచకప్‌లు ఆడాల్సి ఉందని వెంటనే పాంటింగ్‌కు బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

గేల్ సిక్సర్ల వర్షం..

సోమవారం జరిగిన మూడో టీ20లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్( (38 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 67) సిక్సర్ల వర్షం కురిపించాడు. దాంతో విండీస్ సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (31 బంతుల్లో 2ఫోర్లతో 30), హెన్రిక్స్ ( 29 బంతుల్లో 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.

142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 14.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. క్రిస్ గేల్, నికోలస్ పూరన్ (32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఫలితంతో విండీస్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, July 13, 2021, 15:53 [IST]
Other articles published on Jul 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X