న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోయిలో లేని ఉమేష్ యాదవ్ గుర్తొచ్చాడు.. మరీ సిరాజ్ ఎందుకు గుర్తురాలేదో..? నెటిజన్ల ఫైర్

Why Siraj Not Selected In Place Of Shami Who Is ruled Out due to Corona

కరోనా బారిన పడ్డ మహ్మద్ షమీ స్థానంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మరో పేసర్ ఉమేష్ యాదవ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలే జట్టు సెలెక్షన్ పరిగణనలో లేని ఉమేష్ యాదవ్ అనూహ్యంగా సెలెక్ట్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు మొదలెట్టారు. భారత జట్టు దాదాపు మర్చిపోయారనుకున్న ప్లేయర్‌ను మళ్లీ.. జట్టులోకి తీసుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సెలక్టర్లను ఈ విషయంలో కొందరు నిందిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్‌ లాంటి ప్లేయర్ అందుబాటులో ఉండగా.. ఎందుకు ఉమేష్‌ను జట్టులో చేర్చారంటూ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్లో ఫామ్ కనబర్చలేదనే ఒక్క కారణంతోనే సిరాజ్‌ను ఎంపిక చేయలేదా అంటూ మండిపడుతున్నారు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి 25 వరకు జరగనుంది. మొహాలీలో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడనుంది. ఈ సిరీస్ అనంతరం సెప్టెంబర్ 28, అక్టోబర్ 2 అక్టోబర్ 4తేదీలలో దక్షిణాఫ్రికాతో టీమిండియా మరో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. వచ్చే నెల ప్రపంచ కప్‌కు ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్‌లు ఇవే.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులోకి షమీ

ఇకపోతే షమీ స్థానంలో ఉమేష్ యాదవ్ ఆసీస్ సిరీస్ కోసం భారత జట్టులో చేరిన విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. అయితే దాదాపు ఉమేష్ చోటు ఖాయమైందని విశ్వసనీయ సమాచారం. ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన వెంటనే భారత్‌లో జరిగే దక్షిణాఫ్రికా టూర్‌లో మహ్మద్ షమీ తిరిగి ఆడనున్నాడు.

అంతలోపు క్వారంటైన్, ఐసోలేషన్ తదితర నిబంధనలు ముగుస్తాయి. ఇక షమీని టీ20 ప్రపంచకప్ ముందు జట్టు లైనప్లో భాగం చేయాలని.. హర్షల్ పటేల్ గానీ, బుమ్రా గానీ పూర్తి ఫిట్ నెస్ అందుకోకున్నా.. లేక గాయపడ్డ షమీని రిజర్వ్ ప్లేయర్‌గా ఉంచి జట్టును బలోపేతంగానే ఉంచుకోవాలని సెలెక్షన్ కమిటీ భావించింది.

వీళ్లంతా ఉండగా.. ఉమేష్ ఎందుకో?

ఇకపోతే ఆస్ట్రేలియా సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, దీపక్ చాహర్ ఉన్నారు. షమీ మిస్సవ్వడంతో ఉమేష్ యాదవ్ జట్టులోకి రాబోతున్నాడు. అర్షదీప్‌కు ఈ సిరీస్ విశ్రాంతినిచ్చారు. అవేశ్ ఖాన్ పెద్దగా రాణించడం లేదు. ఈ తరుణంలో భారత్‌కు మంచి పేస్ ఆప్షన్ అయిన మహమ్మద్ సిరాజ్‌నే జట్టులోకి తీసుకుంటారని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా ఉమేష్ తెరమీదకి వచ్చాడు. ఇక నెటిజన్లను సిరాజ్‌ను పక్కనపెట్టడం పట్ల సీరియస్ అయ్యారు. అసలే సోయిలో లేని ఉమేష్ యాదవ్ బీసీసీఐకి గుర్తుకొచ్చాడు కానీ సిరాజ్ ఎందుకు గుర్తురాలేదో అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల సిరాజ్ కౌంటీల్లో 5వికెట్ల హాల్ కూడా సాధించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మనే సిరాజ్‌ను పక్కనపెట్టడానికి కారణమంటూ కొందరు ఆరోపించారు. ఇంకొందరు అయితే మోహ్సిన్ ఖాన్, నటరాజన్, ఖలీల్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్ వీళ్లందరిని పక్కన పెట్టి ఉమేష్‌ను సెలెక్ట్ చేయడమేంటో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు.

ఆస్ట్రేలియా సిరీస్‌కు ఇండియా జట్టు

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Sunday, September 18, 2022, 13:57 [IST]
Other articles published on Sep 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X