న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్: సచిన్‌కు ఎందుకు ఇవ్వలేదంటే?

Why Sachin Tendulkar hasn’t been inducted into ICC Hall of Fame yet? Here’s the reason

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ గురువారం అరుదైన గౌరవం దక్కించుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌కు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా ఐసీసీ అతడిని హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి చేర్చింది. గురువారం తిరువనంతపురం వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ఆఖరి వన్డే ప్రారంభానికి ముందు జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన చేతుల మీదుగా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌తో సత్కరించాడు.

మీకోసం: ఆఖరి వన్డేలో మీరు గుర్తించని ఐదు విషయాలివేమీకోసం: ఆఖరి వన్డేలో మీరు గుర్తించని ఐదు విషయాలివే

దీంతో భారత్‌ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఐదో ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ అరుదైన ఘనత సాధించాడు. ద్రవిడ్‌కు ముందు భారత్‌ నుంచి బిషన్‌ సింగ్‌ బేడి, కపిల్‌ దేవ్‌, గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేలకు మాత్రమే ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారత క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ ఓ గుర్తింపు పొందని హీరోగా ఉండేవాడు.

జట్టు కోసం ఏమైనా చేసేవాడు. 2000ల్లో రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా కూడా పనిచేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ 24,000కు పైగా పరుగులు సాధించాడు. 164 టెస్టులాడి 13,288 పరుగులు, 344 వన్డేలాడి 10,889 పరుగులు చేసిన ద్రవిడ్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్

2004లో ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌, టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాలను సైతం అందుకున్నాడు. గురువారం రాహుల్ ద్రవిడ్ పేరుని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చడంపై తాజాగా 24 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు తన సేవలందించిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో ఎందుకు లేడనే చర్చ తెరపైకి వచ్చింది.

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌‌లోకి చేర్చాలంటే

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌‌లోకి చేర్చాలంటే

అయితే, ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌‌లో ఓ క్రికెటర్ పేరుని చేర్చాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇందులో మొదటిది ఏదైనా మేజర్ ఫార్మాట్లలో ఆ ఆటగాడు 8000 పరుగులు లేదా 20కి పైగా సెంచరీలు చేసి ఉండాలి. అంతేకాదు ఆటగాడి యావరేజి కూడా 50కిపైగా ఉండాలి. ఈ నిబంధనకు ద్రవిడ్ సరిపోలడంతో అతడి పేరుని ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన సచిన్

అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన సచిన్

అయితే, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,921 పరగులు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కరే కావడం విశేషం. అయితే, మరేందుకు సచిన్ పేరు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చలేదనే సందేహాం అభిమానుల్లో వచ్చింది.

ఐదేళ్లు లేదా అంతకుమించి ఎక్కువ గ్యాప్

ఐదేళ్లు లేదా అంతకుమించి ఎక్కువ గ్యాప్

ఈ నిబంధనతో పాటు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చాలంటే ఆ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు లేదా అంతకుమించి గ్యాప్ ఉండాలి. సచిన్ టెండూల్కర్ నవంబర్ 16, 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో సచిన్ టెండూల్కర్ ఇంకా ఐదేళ్లు పూర్తి చేసుకోలేదు. దీంతో సచిన్ పేరుని ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో చేర్చలేదు.

Story first published: Friday, November 2, 2018, 15:52 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X