న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాతో సిరిస్: ఓపెనర్‌గా రిషబ్ పంత్‌ను ఎందుకంటే?

India vs Australia 2019: Team India Decided To Go On A Trail with Pant As a Opener With Rohit Sharma
why Rishabh Pant should open in the ODI series vs Australia

హైదరాబాద్: రిషబ్ పంత్ అతి తక్కువ వయసులో భారత జట్టులో తనదైన ముద్రను వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పంత్ బ్యాటింగ్ నైపుణ్యంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపంచారు. పంత్‌కు మంచి భవిష్యత్ ఉందని కొనియాడారు. వృద్ధిమాన్ సాహా గాయాల పాలవడంతో అనూహ్యంగా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

<strong>వరల్డ్ కప్ 2019: భారత జట్టులో ధోని స్థానంపై కైఫ్ ఇలా!</strong>వరల్డ్ కప్ 2019: భారత జట్టులో ధోని స్థానంపై కైఫ్ ఇలా!

అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరిస్‌లో సెంచరీలతో చెలరేగిపోయాడు. కేవలం సెంచరీస్ చేయడమే కాకుండా తన బ్యాటింగ్ స్టయిల్ తో మాజీ క్రికెటర్ లను కూడా మంత్ర ముగ్దులను చేశాడు. అయితే రిషబ్ పంత్‌ను రోహిత్ శర్మకు జోడిగా పంపించడం మంచి వ్యూహం అని మాజీలు అభిప్రాయ పడుతున్నారు.

షేన్ వార్న్, సునీల్ గవాస్కర్‌లు ఇప్పటికే రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపాలని ఇటీవల అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చేరాడు. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం" అని వెల్లడించారు.

అయితే రిషబ్ పంత్‌ను రోహిత్‌కు జోడిగా పంపడం ప్లాన్‌లో భాగమేనని చూపొచ్చు. ఎందుకంటే అనూహ్యంగా కొత్త ఆటగాణ్ణి దించడం వల్ల ప్రత్యర్థిని తికమక పెట్టొచ్చు. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఇటువంటి వ్యూహం బాగా పనిచేస్తుంది. ప్రత్యర్ధులు చేసేదేమి లేక వ్యూహాలను చివరి క్షణంలో మార్చు కునే పరిస్థితి ఏర్పడుతుంది.

Story first published: Tuesday, February 19, 2019, 18:25 [IST]
Other articles published on Feb 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X