న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతిని మిస్ చేస్తే పరుగులు ఎందుకివ్వాలి?: లెగ్-బై రూల్‌ని మార్చాలన్న మార్క్ వా!

Why do you get runs? You missed the ball: Mark Waugh on leg-bye rule in cricket

హైదరాబాద్: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అలాంటి క్రీడలో లెగ్ బైలు ద్వారా పరుగులు ఇవ్వడాన్ని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మార్క్ వా తప్పుబట్టాడు. బంతి ఫ్యాడ్‌కు తగిలి పరుగులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విధానాన్ని క్రికెట్‌లో నుంచి తీసివేయాలని సూచించాడు.

ప్రస్తుతం మార్క్ వా బిగ్ బాష్ లీగ్‌లో ఫాక్స్ క్రికెట్ తరుపున కామెంటేటర్‍‌గా వ్యవహారిస్తున్నాడు. గురువారం మెల్ బోర్న్ స్టార్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తన సహచర కామెంటేటర్ మైకేల్ వాన్‌తో లెగ్ బైలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

ప్రతీ సిక్స్‌కు 250 డాలర్లు ప్రకటించిన క్రిస్‌ లిన్.. ఎందుకో తెలుసా?ప్రతీ సిక్స్‌కు 250 డాలర్లు ప్రకటించిన క్రిస్‌ లిన్.. ఎందుకో తెలుసా?

"మీకు తెలుసా, క్రికెట్‌లో ఒక రూల్‌ని మార్చాలి. టీ20ల్లో లెగ్ బైలు లేకుండా చేయాలి. బంతిని మీరు మిస్ చేసినప్పుడు మీకు పరుగులు ఎందుకు ఇవ్వాలి?" అని ప్రశ్నించాడు. మార్క్ వా వ్యాఖ్యలను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ "ఇది ఆట యొక్క ఒక భాగం" అని చెప్పాడు.

ఇందుకు మార్క్ వా "లెగ్ బైకి అసలు పరుగులు ఎందుకు ఇవ్వాలి? ఇది ఆటలో భాగమని నాకు తెలుసు. అయితే క్రికెట్‌లో మనం దానిని మంచిగా మార్చలేమా? అసలు బ్యాటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బంతిని బాదడం. ఈ నిబంధనను ఎవరైతే ప్రవేశపెట్టారో అతడు ఆర్డినరీ బ్యాట్స్‌మన్ అయి ఉంటాడు" అని అన్నాడు.

క్రీజు వదిలి వెళ్లేదిలేదంటూ అంఫైర్‌ను బండబూతులు తిట్టిన శుభమాన్ గిల్క్రీజు వదిలి వెళ్లేదిలేదంటూ అంఫైర్‌ను బండబూతులు తిట్టిన శుభమాన్ గిల్

దీంతో ఆట నిబంధనలలో మార్పులు చేయడంలో కీలకమైన ఎంసిసి క్రికెట్ కమిటీలో మార్క్ వా భాగం కావాలని వాన్ సూచించాడు. గత కొన్నేళ్లుగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని.. అందులో టీ20 క్రికెట్, ఈ ఏడాది యుకేలో 100 బంతుల ఫార్మాట్‌లో క్రికెట్ ఆడటం... ఐదు రోజుల టెస్టుని నాలుగు రోజులకే పరిమితం చేయడం మొదలైనవి.

Story first published: Friday, January 3, 2020, 15:34 [IST]
Other articles published on Jan 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X