న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

19వ ఓవర్ భువీకి ఇచ్చి ఉంటే!: కెప్టెన్ నిర్ణయమే కొంపముంచిందా?

By Nageshwara Rao
Why bowl Brathwaite at the death? Should Bhuvneshwar Kumar have bowled the 19th over?

హైదరాబాద్: వాంఖడె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఐపీఎల్ 11వ సీజన్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ నిర్ణయమే కారణమని సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అనంతరం 140 పరుగుల లక్ష్య చేధనకు దిగిన చెన్నై విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో క్రీజులో డుప్లెసిస్‌ మినహా పరుగులు రాబట్టే ఆటగాళ్లు ఎవరూ లేరు.

ఇక, సన్‌రైజర్స్ బౌలింగ్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలకు తలో ఓవర్ మిగిలుంది. దీంతో విజయం హైదరాబాద్ జట్టునే అంతా భావించారు. కానీ 18వ ఓవర్‌లో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లకు కాదని బంతిని బ్రాత్‌ వైట్‌కు ఇచ్చాడు.

ఈ ఓవర్‌లో డుప్లెసిస్‌ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 20 పరుగులు రాబట్టాడు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన సిద్ధార్థ్‌ కౌల్‌ 19వ ఓవర్‌లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 19వ ఓవర్‌లో అతడు కూడా 17 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయంది. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 6 పరుగులు కావాల్సిన సమయంలో భువి వేసిన తొలి బంతికే డుప్లెసిస్‌ సిక్సర్‌ బాది చెన్నైని ఫైనల్‌‌కు చేర్చాడు.

హైదరాబాద్ నుంచి మ్యాచ్ చేజారిపోవడానికి కారణం 18వ ఓవర్. అలాంటి ఈ 18వ ఓవర్‌ను డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు అయిన సిద్ధార్ద్ కౌల్‌, భువనేశ్వర్, సందీప్‌ శర్మలలో ఏ ఒక్కరు వేసి పరుగులను కట్టడి చేసినా.. మ్యాచ్‌ సన్‌ వశమయ్యేదని అభిమానులు, క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 19వ ఓవరైనా భువీకిస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వాపోతున్నారు.

Story first published: Wednesday, May 23, 2018, 18:21 [IST]
Other articles published on May 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X