న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ ఆలస్యానికి కారణం ఇదేనా?

why bcci not released ipl 2020 schedule yet

హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ ప్రారంభం కావడానికి నెల కన్నా తక్కువ సమయం ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2020 టోర్నమెంట్ సెప్టెంబర్ 19న ప్రారంభం అయి నవంబర్ 10న ముగుస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సూచాప్రాయంగా చెప్పినా.. అధికారిక షెడ్యూల్‌ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే దీనికి ముఖ్య కారణం కరోనా వైరస్ అని తెలుస్తోంది.

సెప్టెంబర్ 16 వరకు ద్వైపాక్షిక సిరీస్:

సెప్టెంబర్ 16 వరకు ద్వైపాక్షిక సిరీస్:

ఐపీఎల్ 2020లో పాల్గొనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్వారంటైన్ ప్రోటోకాల్స్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 16 వరకు ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటాయి. ఆ మరుసటి రోజు యూఏఈకి చేరుకుంటాయి. అంటే సెప్టెంబర్ 17న ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు యూఏఈలో అడుగుపెడతారు. సెప్టెంబర్ 19న లీగ్ ప్రారంభం అవుతుంది. అయితే గతంలో బీసీసీఐ నిర్దేశించిన ప్రోటోకాల్స్ ప్రకారం.. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. 7 రోజుల్లో వారు మూడుసార్లు కరోనా పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. మూడింట్లో నెగటివ్ వస్తేనే లీగ్ ఆడడానికి అనుమతిస్తారు.

 క్వారంటైన్‌లో ఉంటే:

క్వారంటైన్‌లో ఉంటే:

ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంటే.. 19 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మొదటి వారం మ్యాచులకు దూరం కానున్నారు. ఇది ప్రాంచైజీలకు రుచించడం లేదు. క్వారంటైన్ సమయం ఉంటే.. స్టార్ ఆటగాళ్లు దూరం కానున్నారని కొన్ని ప్రాంచైజీలు అంటున్నాయి. ఏదేమైనా ఆ రెండు జట్ల వారు ఒక బబుల్ నుండి మరొకదానికి మాత్రమే వస్తున్నారు కాబట్టి వారికి క్వారంటైన్‌ అవసరం లేదని హాగానాలు వినిపిస్తున్నాయి.

 ప్లేయర్ కరోనా బారిన పడితే.:

ప్లేయర్ కరోనా బారిన పడితే.:

ఇక ఐపీఎల్ టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలో ఓ ప్లేయర్ కరోనా బారిన పడితే.. అతడు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. అతనితో పటు బయో బబుల్ పంచుకునే వారు కూడా ఆరు రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లి.. మూడు కరోనా వైరస్ పరీక్షలు చేయిచుకోవాలి. అది జరిగితే.. ఆ జట్టు ఆరు రోజుల పాటు మ్యాచులు ఆడడం కుదరదు. కానీ టోర్నమెంట్ మాత్రం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి షెడ్యూల్‌ను తగినంతగా సరళంగా ఉంచే విధానంపై బీసీసీఐ కసరత్తులు చేస్తోందని సమాచారం.

 రెండో వారం కీలకం:

రెండో వారం కీలకం:

అంతేకాకుండా ప్రతి ఐపీఎల్ సీజన్ యొక్క రెండవ వారం వీక్షకుల పరంగా చాలా కీలకమైనదిగా పరిగణించబడుతుంది. రెండవ వారంలో ప్రేక్షకులను టీవీ‌లకు అతుక్కుపోతారు. మొదటి వారంలో మ్యాచులు సాధారణంగా ఉన్నప్పటికీ.. రెండో వారం నుంచి రసవత్తరంగా సాగుతాయి. అప్పుడు లీగ్ చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఇక మూడవ వారం నుండి ప్లేఆఫ్ అర్హత సమీకరణంలోకి వస్తుంది. వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ రెండవ వారం నుండి డబుల్-హెడర్‌లను పెంచే అవకాశం ఉందట. వీటన్నింటిపై బీసీసీఐ కసరత్తులు జరిపి ఆపై అధికారిక షెడ్యూల్ విడుదల చేయనుందని సమాచారం. ఈ వారం రోజుల్లో అధికారిక షెడ్యూల్ రానందట

ఎంఎస్ ధోనీ ఓ అరుదైన రకం: గంగూలీ

Story first published: Monday, August 24, 2020, 15:58 [IST]
Other articles published on Aug 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X