లవ్ ప్రపోజల్: తాజ్ వద్ద భార్యకు అబద్ధం చెప్పిన ఏబీ డివిలియర్స్

By Nageshwara Rao
Why AB de Villiers lied to Danielle while proposing to her!

హైదరాబాద్: ఏబీ డివిలియర్స్ మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో కలిసి పాల్గొన్న ఇంటర్యూలో డివిలియర్స్ తన వైవాహిక జీవితాన్ని కూడా భారత్‌ నుంచే ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.

తాజ్‌మహల్ వద్ద తన భార్య డేనియల్‌కు ప్రపోజ్ చేస్తూ అబద్ధం చెప్పినట్టు తెలిపాడు. పక్కాగా ప్లాన్ చేసి పెద్ద అబద్దం చెప్పేందుకు రెడీ అయ్యానని తెలిపాడు. తన ప్రపోజల్‌ను చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను తాజ్‌మహల్ సెక్యూరిటీ గార్డుల్లా తనను అనుసరించాలని చెప్పానని, డేనియల్‌కు వాళ్లు సెక్యూరిటీగార్డులని అబద్ధం చెప్పానని అన్నాడు.

తన భార్య డెనియల్‌కు లవ్ ప్రపోజ్ చేసే విషయాన్ని చివరి వరకు దాచి ఉంచానని ఏబీ డివిలియర్స్ వివరించాడు. 'నా జీవితంలో అదొక ప్రత్యేకమైన సందర్భం. డెనియల్‌ను ఆశ్చర్యపరిచాను. నేను అక్కడ ప్రపోజ్ చేస్తానని ఆమె ఊహించి ఉండదు. దీనికి తోడు ప్రపోజల్‌కు అంతకంటే మంచి ప్రదేశం మరోటి ఉందని భావించా' అని డివిలియర్స్ తెలిపాడు.

ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ ఎదుట ప్రపోజ్ చేశా

ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ ఎదుట ప్రపోజ్ చేశా

ఐపీఎల్‌కు రెండు నెలల ముందు నుంచే ఆమెకు ప్రపోజ్ చేయానలి ప్లాన్ చేసుకున్నా... అందుకోసం ఉంగరం కూడా తీసుకొచ్చా. తాజ్‌మహల్ వద్దే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నానని ఏబీ తెలిపాడు. ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ ఎదుట తన భార్య డెనియల్ డివిలియర్స్‌కి 'నీతో నా జీవితాంతం జీవించాలని ఉంది, డెనియల్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా' అని డివిలియర్స్ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు.

 ఇక, తనకు మళ్లీ కొడుకు పుడితే తాజ్ అని పేరుపెడతానని

ఇక, తనకు మళ్లీ కొడుకు పుడితే తాజ్ అని పేరుపెడతానని

డివిలియర్స్ అన్నాడు. ‘నాకు మళ్లీ కొడుకు పుడితే ‘తాజ్‌' అని పేరుపెడతా. ఎందుకంటే నాకు భారత్‌, ఇక్కడ ఉన్న తాజ్‌మహల్‌ అంటే చాలా ఇష్టం. 2012 ఐపీఎల్‌ జరిగే సమయంలో నేను తాజ్‌మహల్‌ వద్దే డేనియల్లికి నా ప్రేమను వ్యక్త పరిచాను. 2013లో మా ఇద్దరికీ పెళ్లి అయ్యింది. 2015లో మాకు ఒక బాబు పుట్టాడు' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

డివిలియర్స్ దంపతులకు ఇద్దరు కుమారులు

డివిలియర్స్ దంపతులకు ఇద్దరు కుమారులు

ప్రస్తుతం డివిలియర్స్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏబీ డివిలియర్స్‌ జూనియర్‌ 2015లో జన్మించగా.. జాన్‌ రిచర్డ్‌ డివిలియర్స్‌ 2017లో జన్మించాడు. అయితే మూడో సంతానానికి తాజ్‌ అనే పేరు మనసుకు దగ్గరగా ఉంటుందని డివిలియర్స్ ఈ సందర్భంగా తెలిపాడు. అంతకుముందు ‘కర్ణాటక' అని పెడదామనుకున్నాను కానీ ‘తాజ్‌' పేరే బాగా నచ్చింది. ఇదే పెడతాను' అని డివిలియర్స్ అన్నాడు.

 ఇండియా అంటే ప్రత్యేక అభిమానం

ఇండియా అంటే ప్రత్యేక అభిమానం

దక్షిణాఫ్రికాకు చెందిన చాలా మంది క్రికెటర్లకు ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఆ దేశ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌ తన కుమార్తెకు ‘ఇండియా' అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు. ఖాళీ సమయాల్లో సందర్శించేందుకు కూడా జాంటీ రోడ్స్ భారత్‌కు వస్తుంటాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Friday, May 18, 2018, 15:52 [IST]
  Other articles published on May 18, 2018
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  POLLS

  Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more