న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsSL: సంజూ స్థానం కోసం ఇద్దరి పోటీ.. ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది?

who will replace Sanju Samson in second INDvsSL T20I

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి సంజూ శాంసన్ తప్పుకున్నాడు. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన అతను.. ఫీల్డింగ్ సమయంలో గాయపడి ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా సంజూ మోకాలికి గాయమైందని బీసీసీఐ వెల్లడించింది. అతన్ని వెంటనే స్కానింగ్‌కు తీసుకెళ్లగా.. అతనికి కొంత విశ్రాంతి కావాలని నిపుణులు చెప్పారు. దీంతో అతన్ని ఈ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది.

సంజూ స్థానంలో ఎవరు?

సంజూ స్థానంలో ఎవరు?

ఇప్పుడు సంజూ స్థానంలో ఎవరిని ఆడించాలనే ప్రశ్న తలెత్తింది. తొలి టీ20లో భారీ షాట్‌కు ప్రయత్నించిన సంజూ శాంసన్ కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. కానీ క్రీజులో కొంత కుదురుకుంటే సంజూ ఏ రేంజ్‌లో చెలరేగుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బంతినైనా బౌండరీకి తరలించే సత్తా సంజూకు ఉంది.

అలాంటి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడమంటే మాటలు కాదు. అయితే భారత్ వద్ద కేవలం రెండు ఆప్షన్లు ఉన్నాయి. అతని స్థానాన్ని జితేష్ శర్మతో రిప్లేస్ చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించినా టీమిండియా మాత్రం అతన్ని సరైన రిప్లేస్‌మెంట్‌గా చూడటం లేదట.

అవకాశం దక్కేనా?

అవకాశం దక్కేనా?

సంజూ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీని ఆడించాలా? అని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. సంజూకు సరిగ్గా సరిపోయే ఆటనే త్రిపాఠీ కూడా ఆడతాడు. క్రీజులో కొంచెం కుదురుకున్నాడంటే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. సన్‌రైజర్స్ తరఫున అతను ఎంతగా రాణించాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

దానికితోడు త్రిపాఠీ కూడా మహరాష్ట్ర క్రికెటరే. అతన్ని కనుక ఆడిస్తే తన హోం గ్రౌండ్‌లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేయడం త్రిపాఠీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే సంజూ దిగినట్లు నాలుగో స్థానంలోనే త్రిపాఠీ వస్తాడా? లేక సూర్యకుమార్‌ను కిందకు నెట్టి త్రిపాఠీని మూడో స్థానంలో పంపుతారా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

 రుతురాజ్ అయితే ఎక్కడ?

రుతురాజ్ అయితే ఎక్కడ?

సంజూ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో ఆప్షన్ రుతురాజ్ గైక్వాడ్. ఇంతకుముందు టీమిండియా తరఫున మంచి అవకాశాలు లభించినా వాటిని రుతురాజ్ ఉపయోగించుకోలేకపోయాడు. తను ఆడిన 8 మ్యాచుల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. అయితే ఇటీవల దేశవాళీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతనికి మరో అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ అనుకోవచ్చు.

అయితే రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్.. అతన్ని మిడిల్ ఆర్డర్‌లో ఇరికించాలని చూడటం పొరపాటే అవుతుంది. అందుకని శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ జోడీని విడదీయటం కూడా కరెక్ట్ కాదు. ఈ క్రమంలో రుతురాజ్‌ను జట్టులోకి తీసుకుంటారా? లేక రాహుల్ త్రిపాఠీకి అరంగేట్రం చేసే ఛాన్స్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, January 5, 2023, 16:03 [IST]
Other articles published on Jan 5, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X