ఆసీస్ తదుపరి కోచ్ ఎవరు?: రేసులో ఉన్నది వీళ్లే!

Posted By:
Who next for Australia? Five contenders to succeed Darren Lehmann

హైదరాబాద్: క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని డారెన్ లీమన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

జోహెన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్లు లీమన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించాడు. నిజానికి 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ వరకు లీమన్ పదవిలో ఉండాల్సి ఉంది.

అయితే ఈ బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ముందుగానే కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు కొత్త కోచ్‌ని వెతికే పనిలో పడింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

జస్టిన్ లాంగర్

జస్టిన్ లాంగర్

మాజీ టెస్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జస్టిన్ లాంగర్.. లీమన్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్స్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. 2016 కరీబియన్ పర్యటనలో వన్డే సిరీస్ కోసం పర్యటించిన ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ స్థానంలో కోచ్‌గా వెళ్లాడు. గతేడాది సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా జట్టుతో ఉన్నాడు.

రికీ పాంటింగ్

రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా కోచ్ పదవి రేసులో ఉన్నాడు. ఆసీస్ తరుపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికీ పాంటింగ్‌కు మంచి పేరుంది. అంతేకాదు ఆస్ట్రేలియా క్రికెట్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. జట్టును సమర్థవంతంగా నడిపించిన సత్తా అతనిలో ఉంది. కోచ్‌గా కూడా పాంటింగ్‌కు అపారమైన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా జాతీయ టీ20 జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహించారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

జాసన్ గిలెస్పీ

జాసన్ గిలెస్పీ

ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో క్రికెట్ అస్ట్రేలియాకు కన్సల్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో యార్క్‌షైర్‌కు కూడా పనిచేశాడు. జాసన్ గిలెస్పీ గనుక కోచ్ అయితే బౌలింగ్‌లో అతడికి ఉన్న మంచి అనుభవం ఆసీస్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది.

డేవిడ్ సాకర్

డేవిడ్ సాకర్

ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ మెంటార్ డేవిడ్ సాకర్ గతేడాది భారత్‌లో పర్యటించిన ఆసీస్‌కు ప్రధాన కోచ్ వ్యవహారించాడు. 2016-17 షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా జట్టుకు పనిచేశాడు. గతంలో ఏదో ఒక రోజు కచ్చితంగా ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్ పదవి చేపడతానని ఆశాభావం కూడా వ్యక్తం చేశాడు.

టామ్ మూడీ

టామ్ మూడీ

అంతర్జాతీయ క్రికెట్‌కు 2001లో వీడ్కోలు పలికిన టామ్ మూడీ... అప్పటి నుంచి అనేక జట్లకు కోచ్‌గా పనిచేశాడు. టామ్ మూడీ నేతృత్వంలోనే శ్రీలంక జట్టు 2007 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016 ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడంలో టామ్ మూడీదే కీలకపాత్ర. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, March 30, 2018, 14:44 [IST]
Other articles published on Mar 30, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి