న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత టెస్టు జట్టులో తెలుగు క్రికెటర్..: ఎవరీ హనుమ విహారి

By Nageshwara Rao
India vs England 2018: Hanuma Vihari Gets Test Cap From Kohli
Who is Hanuma Vihari? Know all about Indias latest Test cricketer

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా ప్రారంభమైంది. ఈ టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు లభించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ హనుమ విహారికి చోటు కల్పించింది.

కోహ్లీ మళ్లీ టాస్ ఓడాడు: హనుమ విహారి అరంగేట్రం, ఇంగ్లాండ్ బ్యాటింగ్కోహ్లీ మళ్లీ టాస్ ఓడాడు: హనుమ విహారి అరంగేట్రం, ఇంగ్లాండ్ బ్యాటింగ్

టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా హనుమ విహారి టెస్టు క్యాప్‌ని అందుకున్నాడు. తద్వారా భారత్‌కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ సంఘం తరపున ఆడుతున్న విహారి హైదరాబాద్ నుంచే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

1
42378

విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి

తాజాగా, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్‌ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు.

2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా

మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు. క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీ పోటీల్లో మరింతగా రాణించాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. గత రెండేళ్లుగా భారత్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు.

రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

దీంతో జట్టులోకి అతడిని ఎంపిక చేశారు. జట్టులో క‌రుణ్ నాయ‌ర్ రూపంలో మ‌రో సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ ఉన్నప్పటికీ, అతడిని కాద‌ని విహారికి తుది జ‌ట్టులో చోటు కల్పించారు. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగుతోంది. నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్‌ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు.

Story first published: Friday, September 7, 2018, 17:00 [IST]
Other articles published on Sep 7, 2018
Read in English: Who is Hanuma Vihari?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X