న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ట్రోఫీ నెగ్గడం వెనుక: కోచ్ జయవర్దనే స్ఫూర్తి ప్రసంగం (వీడియో)

Who cares about purple, orange cap, we got trophy: Mahela Jayawardene gives inspiring speech after MIs win

హైదరాబాద్: సమష్టి కృషితోనే ఐపీఎల్ 12వ సీజన్ ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్‌ నిలిచిందని ఆ జట్టు హెడ్ కోచ్‌ మహేళా జయవర్దనే పేర్కొన్నాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మ్యాచ్ ప్రజేంటేషన్ పూర్తి అయిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లును ఉద్దేశించి జయవర్ధనే ప్రసంగించాడు. మన జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్ సాధించలేదని... అయినా సరే కప్‌ గెలిచామని జయవర్దనే చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ముంబై ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లాగా

ముంబై ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లాగా

టోర్నీ ఆసాంతం ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లను సొంత కుటుంబ సభ్యుల్లా ఆకాశ్‌, నీతా అంబానీలు చూసుకున్నారని జయవర్దనే ఈ సందర్భంగా కొనియాడాడు. జయవర్దనే మాట్లాడుతూ "మన జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్ సాధించలేదు. కానీ కప్‌ గెలిచాం. సమిష్టిగా ఆడి విజయం సాధించాం" అని చెప్పుకొచ్చాడు.

అనేక తప్పిదాలు

"చెన్నై మ్యాచ్‌లో మనం అనేక తప్పిదాలు చేశాం. కానీ త్వరగా కోలుకొని అత్యుత్తమ ప్రదర్శననిచ్చాం. ఐపీఎల్‌ 12 గెలవడంలో ప్రతీ ఒక్క ఆటగాడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు" అని జయవర్దనే ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది నాలుగో ఐపీఎల్ ట్రోఫీ కావడం విశేషం.

నాలుగు ఐపీఎల్‌ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా

నాలుగు ఐపీఎల్‌ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా

తద్వారా నాలుగు ఐపీఎల్‌ టోర్నీలు కైవసం చేసుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్‌ చరిత్ర సృష్టించింది. 2013, 2015, 2017, 2019లలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఛాంపియన్స్‌గా అవతరించింది. ఈ విజయంతో ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది.

అశ్విన్‌తో కలిసి రెండో స్థానంలో

అశ్విన్‌తో కలిసి రెండో స్థానంలో

ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మకు ఇది 10వ ఐపీఎల్ పైనల్ మ్యాచ్ కావడం విశేషం. అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని(14), సురేశ్ రైనా(14) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

2009లో తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రోహిత్ శర్మ

2009లో తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రోహిత్ శర్మ

ఆ తర్వాతి 10 ఐపీఎల్ పైనల్స్ మ్యాచ్‌లాడి ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 2007లో వరల్డ్ టీ20 క్యాంపెయిన్‌తో కలిపి రోహిత్ శర్మ ఆడిన 10 టీ20 ఫైనల్స్‌లో 9 మ్యాచ్‌ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్టు విజయం సాధించింది. రోహిత్ శర్మ తన మొదటి ఐపీఎల్ టైటిల్‌ని 2009లో నెగ్గాడు.

Story first published: Tuesday, May 14, 2019, 11:54 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X