టీ షర్టు తీస్తుంటే లక్ష్మణ్ కిందకి లాగాడు: గంగూలీ

Posted By:
When Sourav Ganguly took his shirt off at Lord’s, VVS Laxman tried to pull it down

హైదరాబాద్: గంగూలీ పాత ఙాపకాలను మళ్లీ ఒకసారి సచిన్‌తో కలిసి పంచుకున్నాడు. 2002లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్‌ సాధించిన విజయాన్ని గురించి చర్చించాడు.
ఆ రోజు మ్యాచ్ గెలవగానే కెప్టెన్‌గా ఉన్న గంగూలీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీ షర్ట్ విప్పేసి స్టేడియంలో చక్కర్లుకొట్టాడు.

 నేను తీస్తున్నా.. లక్ష్మణ్ లాగుతున్నాడు

నేను తీస్తున్నా.. లక్ష్మణ్ లాగుతున్నాడు

‘గాల్లో ఎగరవేసేందుకు నా టీ-షర్టు తీస్తున్నా. అప్పుడు నా పక్కనే కూర్చుని ఉన్న ఆటగాడు(లక్ష్మణ్‌ అనుకుంట) నా షర్టును వెనక్కి లాగుతూ ఉన్నాడు. నా వెనుక కూర్చున్న హర్భజన్‌ సింగ్‌ ఏమో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. నువ్వు కూడా చొక్కా తీసి గాల్లో తిప్పు'అని అన్నాను.

 మొదట అర్ధం కాలేదు

మొదట అర్ధం కాలేదు

‘లార్డ్స్‌ బాల్కనీలో కూర్చుని ఉన్నాం. మ్యాచ్‌లో విజయం సాధించగానే గంగూలీ చొక్కా తీసి గాల్లో ఊపడం ప్రారంభించాడు. గంగూలీ ఏం చేస్తున్నాడో నాకు మొదట అర్ధం కాలేదు' అని సచిన్‌ అన్నాడు.

గంగూలీ బ్యాట్‌కు సచిన్ టేపు

గంగూలీ బ్యాట్‌కు సచిన్ టేపు

అప్పటికీ 110 పరుగులు చేశాను. బ్యాట్ హ్యాండిల్ వదులుగా అయినట్లనిపిస్తే.. కూర్చుని అది బిగించుకునే పనిలో ఉన్నాను. అప్పటికే 40 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ నా వైపుగా వచ్చి నేను కడతాను. నువ్వు ఫ్రీగా టీ తాగు. అని బ్యాటుకు టేపు వేశాడు. అప్పటికే సచిన్ మా కంటే సీనియర్. జట్టులోని సహ ఆటగాడితో అంత స్నేహపూర్వకంగా ఉండటం అతని ఔన్నత్యానికి నిదర్శనం అని గంగూలీ తెలిపారు.

 గంగూలీ కంటే చిన్నవాడినే

గంగూలీ కంటే చిన్నవాడినే

స్పందించిన సచిన్ తానేమీ సీనియర్ కాదని గంగూలీ కంటే చిన్నవాడినేనని చెప్పుకొచ్చారు. దానికి బదులుగా దాదా నవ్వుతూ 'అవును. నా కంటే సచిన్ ఆరు నెలలు చిన్న వాడే'నని చెప్పుకొచ్చాడు. 'కానీ అంతర్జాతీయ క్రికెట్ కు రాకముందే మా ఇద్దరికీ పరిచయముంది' అని సచిన్ తెలిపారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 16:00 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి