ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది: ప్రియా ప్రకాశ్‌ను బీట్ చేస్తున్న ఇషాంత్ శర్మ

Posted By: Subhan
When Ishant Sharma did a Priya Prakash Varrier and made us laugh hard!

హైదరాబాద్: ఇంకో 24గంటల్లో ఫిబ్రవరి 14 రాబోతుంది అంటే వాలంటైన్స్ డే అన్నమాట. మారుతున్న జనరేషన్‌ని బట్టి ప్రేమికుల రోజు పురస్కరించుకుని యువత అంతా ప్రేమ లేఖలు మానేసి, వాట్సప్‌లో మెసేజ్‌లు, వీడియోలు పంపుకోవడం పరిపాటైంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ వారియర్ అనే మళయాలీ హిరోయిన్ కన్నుకొడుతూ ఉన్న వీడియో క్లిప్ ఒకటి వైరల్‌గా తిరుగుతుంది.

ఆమెకు స్పందించినట్లుగా రజనీకాంత్‌తో పలువురి తారల పేరడీ ఫొటోలు వైరల్‌గా తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె క్రీడల్లోకి కూడా వచ్చేసింది. అది ఎవరితో పోలుస్తోనో కాదు. ఎక్స్‌ప్రెషన్ కింగ్ ఇషాంత్ శర్మతో. .

ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ గుండెల్ని కొల్లగొడుతున్న ప్రియా ప్రకాశ్ వీడియో చూసిన వాళ్లు ఈ ఫొటో చూసి నవ్వు ఆపుకోలేరు. అతని ఎక్స్‌ప్రెషన్‌లతో అందరినీ తన వైపుకు తిప్పుకున్న ఇషాంత్ ప్రియా ప్రకాశ్‌ను ఓడిస్తున్నాడు.

ఈ ఫోజ్‌కు బదులుగా మార్చి 2017 చిన్న స్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా తనూ ఓ ఫన్నీ ఫేస్ తో ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఫోజ్‌తో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. ఇషాంత్ శర్మ. ఇప్పుడు ఇదే ఫొటోను ప్రియా ప్రకాశ్‌కు జోడిస్తూ మళ్లీ ఇషాంత్ ఎక్స్‌ప్రెషన్‌ని వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, February 13, 2018, 15:44 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి