న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హక్ ట్రిపుల్ సెంచరీ ప్రేరణతో: అరుదైన రికార్డు నెలకొల్పిన పాక్ ఓపెనర్

By Nageshwara Rao

దుబాయి: 14 ఏళ్ల క్రితం లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్‌ హక్‌ ట్రిపుల్ సెంచరీని వీక్షించేందుకు వచ్చి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా ఉన్న అజహర్ అలీ అరుదైన రికార్డుని నమోదు చేశాడు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టుకు ఓ ఆశాకిరణంగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దుబాయిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీ సాధించి పాకిస్థాన్ ఆల్‌టైమ్ ఎలైట్ గ్రూప్‌లో చేరాడు. కెరీర్‌‌లో 50వ టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ అజహర్‌ అలీ (302 నాటౌట్‌; 469 బంతుల్లో 23×4, 2×6) ట్రిపుల్‌ సెంచరీ సాధించిన నాలుగో పాకిస్థాన్‌ ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఈ టెస్టు మ్యాచ్ పాకిస్థాన్‌కు 400వ టెస్టు మ్యాచ్. గులాబీ బంతితో దుబాయిలో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో అజహర్ అలీ ట్రిపుల్ సెంచరీతో చెలరేగి పోయాడు. పాకిస్థాన్ తరుపున ఇది నాలుగో ట్రిపుల్ సెంచరీ. గతంలో పాక్ తరుపున హనీఫ్‌ మహ్మద్‌ (337), ఇంజమాముల్‌ హక్‌ (329), యూనిస్‌ ఖాన్‌ (313)లు ట్రిపుల్ సెంచరీలు సాధించారు.

When Inzamam hit 329 I was substitute fielder, recalls triplecenturion Azhar Ali

ఇక టెస్టుల్లో మొత్తంగా చూస్తే ఇది 29వ ట్రిపుల్ సెంచరీ. టెస్టుల్లో అజహర్ అలీ నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అనంతరం ఈ ఘనతను సాధించాడు. మ్యాచ్‌లో వెస్టిండిస్ బౌలర్ బ్లాక్‌వుడ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టడంతో అలీ ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు.

146 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట ప్రారంభించిన అజహర్ అలీ తన ఆటతీరుతో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాడు. అజహర్‌కు తోడుగా షఫీఖ్ (67), బాబర్ ఆజం (69) రాణించారు. పాక్ తమ తొలి ఇన్నింగ్‌‌సను 155.3 ఓవర్లలో 579 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

ట్రిపుల్ సెంచరీ సాధించడంపై అజహర్ అలీ

14 ఏళ్ల క్రితం 2002లో లాహోర్ లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంజమామ్ ట్రిపుల్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో అజహర్ అలీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా చేశాడు. ఇంజమామ్ ట్రిపుల్ సెంచరీ చేసిన తరువాత, అతని స్థానంలో అజహర్ అలీ సబ్ స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. న్యూజిలాండ్‌పై ఇంజమాముల్‌ హక్‌ ట్రిపుల్ సెంచరీ సాధించిన తరుణంలో తాను హక్‌కు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

అదే ట్రిపుల్ సెంచరీ ప్రేరణతో తాను ఇప్పుడు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇలా తన క్రికెట్ ప్రస్థానంలో ట్రిపుల్‌ను చూడటం, ఆ తరువాత అదే ఘనతను సాధించడంపై అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇదొక మరచిపోలేని అనుభూతిగా అజహర్ పేర్కొన్నాడు. ఈ ఘనత పట్ల తన భావాలను ఎలా షేర్ చేసుకోవాలో తెలియడం లేదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు.

'నాకు ఇంకా గుర్తుంది. ఇంజమామ్ ట్రిపుల్ చేసిన టెస్టుల్లో నేను సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాను. ఇప్పుడు ఆ అరుదైన ఘనతను అందుకున్నాను. ఇది ఎప్పటికీ నా జీవితంలో ప్రత్యేకంగా ఉండిపోతుంది' అని అజహర్ తెలిపాడు. అయితే తన రోల్ మోడల్ అయిన యూనిస్ ఖాన్ ఈ మ్యాచ్‌ను చూడకపోవడం కొంత వెలితిగా ఉన్నట్లు తెలిపాడు. యూనిస్ ఖాన్ డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X