న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భార్యకు బానిస' ట్వీట్‌పై సానియా మీర్జా వివరణ.. ఏమందంటే?!!

When husbands don’t perform, wives are blamed: Sania Mirza on joru ka ghulaam tweet

హైదరాబాద్: 2020 మహిళా టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌పై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. స్టార్క్‌ తన భార్య ఎలీసా హేలీ మ్యాచ్ చూడడానికి రావడంతో 'భార్యకు బానిస' అని ట్వీట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయింది. దీనిపై సానియా తాజాగా క్లారిటీ ఇచ్చింది.

బ్రియన్‌ లారాతో ఉన్న ఆ యువ భారత ఆటగాడు ఎవరో తెలుసా?బ్రియన్‌ లారాతో ఉన్న ఆ యువ భారత ఆటగాడు ఎవరో తెలుసా?

సరిగా ఆడలేకపోతే భార్యల తప్పే అంటారు:

సరిగా ఆడలేకపోతే భార్యల తప్పే అంటారు:

భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మ్రితి మంధానల యూట్యూబ్ చానల్ డబుల్ ట్రబుల్‌లో సానియా మీర్జా తన ట్వీట్‌కు అర్థం చెప్పింది. సాధారణంగా భర్తలు ఏదైనా సాధిస్తే.. అది వారి గొప్పతనంగా భావిస్తారని, ఒకవేళ సాధించకపోతే వారి భార్యల వల్లే సాధించలేకపోయారంటూ సమాజం అంటుందని సానియా పేర్కొంది. దీనికి ఎలాంటి ఆధారం లేకపోయినా.. తరతరాలుగా ఇలాగే కొనసాగుతున్నది. ఆ విషయం తనకు అనుష్క శర్మ బాగా తెలుసని తెలిపింది. తమ భర్తలు బాగా ఆడితే వారి ప్రతిభను పొగుడుతారని, ఒకవేళ వారు సరిగా ఆడలేకపోతే అది భార్యల తప్పేనని అంటారని చెప్పుకొచ్చింది.

 నేను ఆడే టెన్నిస్ మ్యాచ్‌కు షోయబ్ వస్తే:

నేను ఆడే టెన్నిస్ మ్యాచ్‌కు షోయబ్ వస్తే:

సానియా మీర్జా మాట్లాడుతూ... 'ఒకవేళ మా భర్తలు ఆడే మ్యాచ్‌ చూద్దామని మేము వస్తాం. ఆ మ్యాచ్‌లో వారు సరిగా ఆడలేకపోతే.. మా వల్లే వారు ఆడలేకపోయారని ఎన్ని మాటలు అంటారో. భార్య మ్యాచ్ చూడడానికి స్టార్క్ వచ్చినట్లు.. నేను ఆడే టెన్నిస్ మ్యాచ్‌కు షోయబ్ మాలిక్ వస్తే ఇక అతడిని వదిలిపెట్టరు. భార్యకు బానిసగా మారాడంటూ మాట్లాడతారు' అని సానియా వివరణ ఇచ్చింది. అప్పుడు చేసిన ట్వీట్ హాస్యంగా చేసినప్పటికీ.. అందులో చాలా అర్థం ఉందని సానియా పేర్కొంది.

 సతీమణి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు:

సతీమణి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు:

సతీమణి, ఆస్ట్రేలియా మహిళా ఓపెనర్ ఎలీసా హేలీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో అప్పటికే ఆసీస్ 0-2తో వెనకబడిన కారణంగా.. చివరి వన్డే నామమాత్రమే కావడంతో స్టార్క్ మెల్‌బోర్న్ వెళ్ళడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిచ్చింది. హేలీ ఆటను చూసేందుకు స్టార్క్‌ స్వదేశానికి రావడంపై సానియా సరదాగా స్పందించింది. స్టార్క్‌ చేసిన పనికి ఉపఖండంలో అయితే అతడిని భార్యకు బానిస అనేవారు అని ట్వీట్‌ చేసింది.

ఇప్పుడు పరిస్థితులు మారాయి:

'న్యూస్ పేపర్లు, మ్యాగజైన్, బిల్ బోర్డ్స్‌లో క్రీడాకారుణులు కనిపిస్తున్నారు. ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ మహిళ.. స్పోర్ట్స్ పర్సన్‌గా ఉండాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి అనేదానికి ఇవన్నీ నిదర్శనం. కానీ చివరి మెట్టును అందుకోవడానికి మాత్రం మరింత దూరం ప్రయాణించాల్సి ఉంది. ఒక బాలిక తనకు తానుగా బాక్సింగ్ గ్లౌవ్స్ వేసుకోవాలి. ఓ అమ్మాయి ఇష్టంతో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాలి. నేను రెజ్లర్ అవుతానని మరో అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి. ఇవన్నీ సర్వ సాధారణంగా జరిగిపోవాలి. మహిళలు స్వతంత్రంగా స్పోర్ట్స్ కెరీర్‌ను ఎంచుకునే స్థాయికి ఎదగాలి. ఇందులో పురోగతి సాధించినప్పుడే మనం తుది మెట్టును అందుకుంటాం' అం సానియా తాజాగా పేర్కొంది.

Story first published: Friday, May 8, 2020, 7:50 [IST]
Other articles published on May 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X