న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌యే నన్ను అన్ని రకాలుగా కాపాడింది: షమీ

What kept Mohammed Shami going after wife Hasin Jahan’s adultery accusations

హైదరాబాద్: జీవితంలో తానెంతగానో ప్రేమించి క్రికెట్‌యే తనను అన్ని రకాలుగా కాపాడిందని మొహమ్మద్ షమీ పేర్కొన్నాడు. బుధవారం ఇంగ్లాండ్‌తో తలపడిన టీమిండియా తుది జట్టులో షమీ చోటు సంపాదించుకున్నాడు. తొలి టెస్టులో మొదటి రోజు ఆటలో షమి 64 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో షమిపై అతని భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన షమి

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన షమి

మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తనపై హత్యాయత్నం చేశాడనీ హసీన్‌ ఆరోపణలు చేసింది. కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అంతటితోనే కాకుండా.. క్రికెట్‌ అకాడమీ నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో షమి కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో షమి బయటపడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగా షమి ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోయాడు. వీటన్నింటినీ అధిగమించి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన షమి బుధవారం మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

 దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సమస్యలతో పోరాడుతున్నా:

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సమస్యలతో పోరాడుతున్నా:

‘దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం మైదానం వెలుపల ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాను. కానీ, క్రికెట్‌ నుంచి ఎప్పుడూ దృష్టి మళ్లించలేదు. ఎందుకంటే క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. జీవితంలో నేను ఎక్కువగా ఇష్టపడేది ఏదంటే క్రికెటే. బౌలర్‌గా నా వృత్తి నిర్వహిస్తా. క్రికెట్‌ ఆడేందుకే మొదటి ప్రాధాన్యత. మిగతావన్ని జీవితంలో ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలా జరుగుతాయి.. అంతే' అని అన్నాడు.

తొలి సెషన్‌లో వికెట్‌ చాలా నెమ్మదిగా:

తొలి సెషన్‌లో వికెట్‌ చాలా నెమ్మదిగా:

‘నా బౌలింగ్‌ ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం దక్కింది. భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రదర్శనే చేయాలనుకుంటున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అవన్నీ పక్కనపెట్టి బాధ్యతగా ఆడాలి. తొలి సెషన్‌లో వికెట్‌ చాలా నెమ్మదిగా ఉంది. దీంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులేయడానికే ప్రయత్నించా. బ్యాట్స్‌మెన్‌ను, వికెట్లను దృష్టిలో పెట్టుకునే బంతులేశా.'

ఏడో ఓవర్‌లో వచ్చిన స్ఫూర్తిని నింపిన అశ్విన్‌:

ఏడో ఓవర్‌లో వచ్చిన స్ఫూర్తిని నింపిన అశ్విన్‌:

'అశ్విన్‌ కూడా చక్కగా బౌలింగ్‌ చేశాడు. సాధారణంగా ఇంగ్లిష్‌ గడ్డపై ఫాస్ట్‌ బౌలర్లు రాణిస్తారు. కానీ, ఏడో ఓవర్‌లోనే బౌలింగ్‌ చేయడానికి వచ్చిన అశ్విన్‌ మాలో స్ఫూర్తిని నింపాడు. పేసర్ల బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు పరుగులు తీసినా రవిశాస్త్రి మాత్రం బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు' అని షమి తెలిపాడు.

Story first published: Thursday, August 2, 2018, 15:45 [IST]
Other articles published on Aug 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X