న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: నోటికి పనిచెప్పిన ఆసీస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మను కవ్వించిన లబుషేన్!(వీడియో)

‘What are you doing in quarantine?’ – Marnus Labuschagne hilariously asks Rohit Sharma while fielding at short leg

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. సూటి పోటి మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ కవ్వించాడు. సరదా ప్రశ్నలు, మాటలతో విసిగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

రోహిత్‌ను కవ్విస్తూ..

రోహిత్‌ను కవ్విస్తూ..

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. షార్ట్‌ లెగ్‌లో హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేసిన లబుషేన్ తన మాటలతో విసిగించాడు. తొలుత 'నీ ఫేవరేట్ క్రికెట్ ఎవరు?'అని శుభ్‌మన్ ప్రశ్నించగా.. అతను మ్యాచ్ ముగిసిన తర్వాత చెబుతానని బదులిచ్చాడు. ఆ వెంటనే సచినా? అని ప్రశ్నిస్తూ.. విరాట్ కోహ్లీని లెక్కలోకి తీసుకోవా? అని అడిగాడు. ఆ తర్వాత క్యాచ్ క్యాచ్ అంటూ బ్యాటింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్‌ను టీజ్ చేశాడు.

క్వారంటైన్‌లో ఏం చేశావ్..

ఆ వెంటనే క్వారంటైన్‌లో ఏం చేశావని హిట్ మ్యాన్‌ను అడిగాడు. కానీ రోహిత్ అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకున్నాడు. తర్వాత కూడా హడావుడిగా మాట్లాడుతూ భారత బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అయింది.

ఆసీస్ 338 ఆలౌట్..

ఆసీస్ 338 ఆలౌట్..

166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

భారత్ 96/2

భారత్ 96/2

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), అజింక్యా రహానే (4) ఉన్నారు. శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(26) తీవ్రంగా నిరాశపరిచాడు. హజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కమిన్స్ శుభ్‌మన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Friday, January 8, 2021, 13:34 [IST]
Other articles published on Jan 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X