న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విండిస్‌కు ఊహించని దెబ్బ: సిరిస్ నుంచి తప్పుకున్న కీలక ఆటగాడు

India vs West Indies 2019 : Russell Pulls Out Of Opening T20s With Injury || Oneindia Telugu
West Indies vs India: Russell pulls out of opening T20s with injury

హైదరాబాద్: టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే వెస్టిండిస్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా అమెరికాలోని ప్లోరిడాలో జరిగే మొదటి రెండు టీ20లకు ఆల్‌రౌండర్‌ రసెల్‌ దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో రసెల్‌ గాయపడిన సంగతి తెలిసిందే.

యాషెస్‌లో ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేయడం బాధించలేదు'యాషెస్‌లో ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేయడం బాధించలేదు'

రస్సెల్ స్థానంలో మహ్మద్‌

రస్సెల్ స్థానంలో మహ్మద్‌

అయినా టీమిండియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం ప్రకటించిన జట్టులో విండిస్ సెలక్టర్లు రస్సెల్‌కు చోటు కల్పించారు. అయితే, గాయం ఇంకా అలాగే ఇబ్బంది పెడుతుండటంతో రస్సెల్ తనంతట తానుగా ఈ పర్యటన నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో జేసన్‌ మహ్మద్‌ను ఎంపిక చేసినట్లు కోచ్‌ ఫ్లాయిడ్‌ తెలిపాడు.

విచిత్ర ఘటన.. అభిమానుల ప్రేమకు 'ఫిదా' అయిన కోహ్లీ (వీడియో)

రస్సెల్ దూరం కావడం ఇబ్బందే

రస్సెల్ దూరం కావడం ఇబ్బందే

"టీ20ల్లో రస్సెల్ వంటి కీలక ఆటగాడు జట్టుకు దూరం కావడం ఇబ్బంది కలిగించే అంశమే. అయినప్పటికీ అతని స్థానంలో ఆడనున్న మహ్మద్‌ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడు" అని కోచ్‌ ప్లాయిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 32 ఏళ్ల మహ్మద్‌కు గతంలో విండిస్‌కు ఆడిన అనుభవం ఉంది.

తొలి టీ20 శనివారం

తొలి టీ20 శనివారం

వెస్టిండిస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ పర్యటనలో మొదటి రెండు టీ20లు అమెరికాలోని ప్లోరిడా వేదికగా జరగనున్నాయి. అనంతరం మిగతా సిరిస్ అంతా కరేబియన్ దీవులకు మారనుంది. మూడో మ్యాచ్‌ గయానా వేదికగా ఆరో తేదీన జరగనుంది.

రస్సెల్ లేకపోయినా విండిస్ బలంగానే

రస్సెల్ లేకపోయినా విండిస్ బలంగానే

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 శనివారం జరగనుంది. కాగా, ఆల్ రౌండర్ రస్సెల్ లేకపోయినా ఎవిన్‌ లూయిస్‌, హెట్‌మయర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ లాంటి విధ్వంసకారులతో విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాట్రెల్‌, నరైన్‌, ఒషాన్‌ థామస్‌‌లు లీడ్ చేయనున్నారు.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

భారతదేశం: విరాట్ కోహ్లీ (సి), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీక్ అహ్మదర్ నవదీప్ సైని.

వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, ఎవిన్ లూయిస్, షిమ్రాన్ హెట్మియర్, నికోలస్ పూరన్, కీరోన్ పొలార్డ్, రోవ్మన్ పావెల్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కీమో పాల్, సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఓషాన్ థామస్, ఆంథోనీ బ్రాంబుల్, ఆండ్రీ రస్సెల్, ఖారీ పియరీ.

టెలికాస్ట్ డిటేల్స్

మ్యాచ్ ప్రారంభం: రాత్రి 8 గంటలకు

సోనీ టెన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక, ఆన్‌లైన్‌లో సోనీ లివ్‌లో చూడొచ్చు.

Story first published: Saturday, August 3, 2019, 8:40 [IST]
Other articles published on Aug 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X