విచిత్ర ఘటన.. అభిమానుల ప్రేమకు 'ఫిదా' అయిన కోహ్లీ (వీడియో)

ముంబై: ప్రపంచం మొత్తంలో సినిమా హీరోలు, క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది. ఇక మన భారత దేశంలో అయితే చెప్పనవసరం లేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావించే మన దేశంలో అయితే క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా నడుస్తోంది. వీరు ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే కోహ్లీ ఎదురైంది. వారి అభిమానాన్ని చూసి కోహ్లీ ఫిదా అయ్యాడు.

భారీ సంఖ్యలో అభిమానులు:
తాజాగా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీ ఫిలిప్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీని చూసేందుకు అతని అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. కోహ్లీని చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. ఇక కోహ్లీ ఎంట్రీ ఇవ్వగానే 'కోహ్లీ.. కోహ్లీ' అంటూ గట్టిగా అరవడం మొదలెట్టారు. ఇది చూసిన కోహ్లీ ఆశ్చర్యపోతూ.. అందరికి హాయ్ చెప్పాడు.
విచిత్ర అనుభవం:
ఈ ఘటనకు సంబందించిన వీడియోను కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసాడు. 'వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేముందు నాకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ముంబైలో జరిగిన ఫిలిప్స్ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అంతమందిని చూసి ఆచ్చర్యపోయా. అభిమానుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

పిల్లలతో కలిసి కోహ్లీ ఎంజాయ్:
బుధవారం విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొట్టాడు. స్నేహితులతో కలిసి ఇద్దరూ సరదా సమయం గడిపారు. అందరూ ఓ హోటల్లో లంచ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం మియామి వీధుల్లోని అభిమానులతో విరుష్క జంట సందడి చేసింది. ముఖ్యంగా కోహ్లీ చిన్న పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసాడు. అభిమానుల అందరితో ఇద్దరూ సెల్ఫీలు దిగారు. వారికి కోహ్లీ ఆటో గ్రాఫ్ కూడా ఇచ్చాడు. ఫ్యాన్స్‌తో దిగిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

ఫ్లోరిడాలో రెండు టీ20లు:
కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడిన అనంతరం టీమిండియా వెస్టిండీస్ వెళ్లనుంది. సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా భాద్యతలు నిర్వర్తించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications