న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్ సిరీస్‌లో కోచ్ రవిశాస్త్రి సూచనలు పని చేశాయి: విహారి

West Indies vs India: Hanuma Vihari credits coach Ravi Shastris advice for changing his stance


కింగ్‌స్టన్‌:
వెస్టిండీస్ సిరీస్‌లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన సూచనలు పాటించడం వలెనే రాణించానని తెలుగు తేజం హనుమ విహారి పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 257 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్టులో సెంచరీ (111), అర్ధ సెంచరీ (53)తో సత్తా చాటిన హనుమ విహారి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' గా ఎంపికయ్యాడు.

ఉత్కంఠభరిత పోరులో లంకపై కివీస్ విజయం.. సిరీస్‌ కైవసంఉత్కంఠభరిత పోరులో లంకపై కివీస్ విజయం.. సిరీస్‌ కైవసం

 శాస్త్రి సూచనలు పని చేశాయి:

శాస్త్రి సూచనలు పని చేశాయి:

విహారి మాట్లాడుతూ... 'బ్యాటింగ్‌ స్టాన్స్‌ మార్చుకునే విషయంలో రవిశాస్త్రి కొన్ని సూచనలు చేశారు. సాధారణంగా నేను బ్యాటింగ్ చేసేటప్పుడు నిటారుగా నిలబడుతా. అయితే కాళ్లు కాస్త వంచి ఆడాలని కోచ్ సూచించారు. రెండో టెస్టులో అదే విధంగా ఆడా. దీంతో ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ ఆడేందుకు సౌకర్యంగా అనిపించింది. ఈ పర్యటనలో పరుగులు చేసానంటే ఆ ఘనత రవిశాస్త్రికే దక్కుతుంది. కోచ్ మరిన్ని సూచలు కూడా చేసారు. అన్నిటిని పాటిస్తా' అని విహారి అన్నాడు.

ఒత్తిడిలో ఆడటాన్ని ఇష్టపడతా:

ఒత్తిడిలో ఆడటాన్ని ఇష్టపడతా:

'ఒత్తిడిలో ఆడటాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడతాను. అదే మనలోని అసలు ఆటను బయటపెడుతుందని నా నమ్మకం. తొమ్మిదేళ్ల క్రితమే నా ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ ప్రారంభమైంది. అప్పుడే 6 వేల పరుగులు దాటేశాను. స్వదేశంలో ఇంకా టెస్టు ఆడలేదు. దాని కోసం ఎదురు చూస్తున్నాను. సొంత ప్రేక్షకుల మధ్య బ్యాటింగ్‌ చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. బహుశా చిన్నప్పటి నుంచి ఎక్కువగా బ్యాటింగ్‌ చేయడం వల్లేనే జుట్టు ఇంతగా ఊడిపోయిందేమో' అని విహారి సరదాగా పేర్కొన్నాడు.

 భారీ స్కోరు చేయాలనుకున్నా:

భారీ స్కోరు చేయాలనుకున్నా:

'తొలి టెస్ట్ సెంచరీ సాధించడం చాలా గొప్పగా ఉంది. గత మ్యాచ్‌లో సెంచరీ ముందు ఔట్ అయ్యాను. ఈసారి ఎలా అయినా భారీ స్కోరు చేయాలని నిర్ణయించుకున్నా. ఈ పిచ్‌పై ఓపిక అవసరం. బౌలర్లకు పిచ్‌ అనుకూలిస్తున్న సమయంలో చెత్త బంతి కోసం ఎదురు చూడాలి. రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రణాళిక బాగా పని చేసింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగడం ఫలితాన్ని ఇచ్చింది. రహానే, ఇషాంత్ సహకారం ఎప్పటికి మరిచిపోలేను' అని విహారి తెలిపాడు.

యూఎస్‌ ఓపెన్‌.. రోజర్ ఫెదరర్‌కు షాక్!!

రోహిత్ శర్మకు కష్టమే:

రోహిత్ శర్మకు కష్టమే:

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రహానే అండగా రెచ్చిపోయిన విహారి.. రెండో టెస్టులో సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకున్నా అదరగొట్టాడు. విండీస్ పేసర్లు హోల్డర్, రోచ్ నిప్పులు చెరుగుతున్నా.. ఏ మాత్రం తడబడకుండా సూపర్ సెంచరీ (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) చేసాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా కీలక అర్ధ శతకం చేసి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు రోహిత్ శర్మ టెస్టు అవకాశాలను మరింత సంక్లిష్టం చేశాడు.

Story first published: Wednesday, September 4, 2019, 11:46 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X