న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సెంచరీ కోసం కాదు.. జట్టు కోసమే ఆలోచిస్తా'

India vs West Indies 2019 : Ajinkya Rahane Explains Reasons For Ashwin’s Exclusion In Playing XI
West Indies vs India, 1st Test: Ajinkya Rahane explains reasons for R Ashwin’s exclusion in playing XI

ఆంటిగ్వా: సెంచరీ కోసం కాదు, ఎప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా అని భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. రెండు టెస్ట్ సిరీస్‌లలో భాగంగా వెస్టిండీస్‌, భారత్‌ జట్ల మధ్య గురువారం తొలి టెస్ట్ ప్రారంభం అయింది. ఆతిథ్య విండీస్‌ పేస్ బౌలర్లు విజృంభించడంతో భారత్‌కు తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. అయితే అజింక్య రహానే (81; 163బంతుల్లో 10×4) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

<strong>ఉద్రిక్త పరిస్థితులు.. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ వాయిదా</strong>ఉద్రిక్త పరిస్థితులు.. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ వాయిదా

జట్టు కోసమే ఆలోచిస్తా:

జట్టు కోసమే ఆలోచిస్తా:

సెంచరీ చేసే అవకాశాన్ని చేజ్చార్చుకోవడంపై మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ... 'జట్టు ప్రయోజనాలను దృష్టిల్లో పెట్టుకుని బ్యాటింగ్ చేస్తా. సెంచరీ కోసం ఎప్పుడూ ఆలోచించను, జట్టు కోసమే ఆలోచిస్తా. నేను స్వార్థ క్రికెటర్‌ని కాదు. సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తా. సహజశైలిలో బ్యాటింగ్ చేస్తే.. సెంచరీ అదే వస్తుంది. సెంచరీ కోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు' అని రహానే తెలిపాడు.

బెంచ్‌పై కూర్చోబెట్టడం చాలా కష్టం:

బెంచ్‌పై కూర్చోబెట్టడం చాలా కష్టం:

'రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాడు తుది జట్టులో లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ.. ఉత్తమ కలయిక ఏమిటో జట్టు యాజమాన్యం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వికెట్‌పై రవీంద్ర జడేజా మంచి ఎంపిక అని వారు భావించారు. ఎందుకంటే మాకు ఆరో బ్యాట్స్‌మన్‌ కూడా అవసరం. జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఈ ట్రాక్‌పై విహారీ బాగా బౌలింగ్ చేయగలడు కాబట్టి కెప్టెన్, కోచ్ అతన్ని తీసుకున్నారు. రోహిత్ వంటి ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టడం చాలా కష్టం' అని రహానే పేర్కొన్నాడు.

సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా

కౌంటీల్లో ఆడటం కలిసొచ్చింది:

కౌంటీల్లో ఆడటం కలిసొచ్చింది:

'ప్రపంచకప్‌లోచోటు కోల్పోయిన తర్వాత కౌంటీ గేమ్‌ల్లో ఆడాను. రెండు నెలల కాలంలో ఏడు కౌంటీ గేమ్స్‌ ఆడా. దాంతో బ్యాటింగ్‌పై ఏకాగ్రత పెరిగింది. కౌంటీల్లో ఆడటంతో మరింత మెరుగయ్యా. ప్రధానంగా ఇంగ్లండ్‌లో డ్యూక్‌ బాల్స్‌తో క్రికెట్‌ ఆడేటప్పుడు ప్రతీ బంతిని బాడీ లైన్‌ మీద ఆడాల్సి వస్తుంది. కౌంటీల్లో ఆడటం ఎంతో కలిసొచ్చింది. మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది' అని రహానే చెప్పుకొచ్చాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును రహానే కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

Story first published: Friday, August 23, 2019, 11:54 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X