న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా

BWF World Championships: Sai Praneeth stuns Anthony Ginting to reach quarters, PV Sindhu Enters Quarters

బాసెల్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 16వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్యాంకర్‌, ఆరో సీడ్‌ ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా)ను ఓడించి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరోవైపు తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టగా.. సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌లు క్వార్టర్స్‌ చేరకుండానే నిష్క్రమించారు.

తొలి టెస్టు: విండీస్ పేసర్ల విజృంభణ.. ఆదుకున్న రహానే

గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌ పోరులో ప్రణీత్‌ 21-19, 21-13తో జిన్‌టింగ్‌ను చిత్తుచేసి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణీత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న జిన్‌టింగ్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ సమయంలో ప్రణీత్‌ వరుసగా 4 పాయింట్లు సాధించి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15-15తో సమానంగా నిలిచారు. అయితే కీలక సమయంలో అద్భుతంగా పోరాడిన ప్రణీత్‌ వరుసగా 4 పాయింట్లు సాధించి 21-17తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ ఆధిక్యం మారుతూ వచ్చినా.. చివరకు ప్రణీత్‌ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరు ఐదు సార్లు తలపడగా.. మూడింట్లో సాయి, రెండింట్లో జిన్‌టింగ్‌ పైచేయి సాధించారు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-6తో తొమ్మిదో సీడ్‌, అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ను సునాయంగా ఓడించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో ఉన్న సింధు.. ఆ తర్వాత మరింత జోరు పెంచి గేమ్‌ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధుకు ఎదురే లేదు. జాంగ్‌ 3 పాయింట్ల వద్దే ఉండగా.. సింధు 14 పాయింట్లకు దూసుకెళ్లింది. అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ను సింధు ఢీకొంటుంది.

మహిళల సింగిల్స్‌ మరో ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 21-15, 25-27, 12-21తో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూసింది. కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో 14-21, 13-21తో థాయ్‌లాండ్‌ క్రీడాకారుడు వాంగ్‌చెరోయిన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండో రౌండ్లో దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించిన సంచలనం సృష్టించిన ప్రణయ్‌.. టాప్‌ సీడ్‌ కెంటో మొమొటా చేతిలో 19-21, 12-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Story first published: Friday, August 23, 2019, 8:58 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X