న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2019 వరల్డ్ కప్‌: అర్హత సాధించిన వెస్టిండీస్‌, ఇంక మిగిలింది ఒక్కరికే

West Indies singing in the rain as they clinch World Cup spot

హైదరాబాద్: 2019 వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనాలనే వెస్టిండీస్ కల ఎలాగైతే నెరవేరింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరుగనున్న మెగా టోర్నీకి అర్హత సాధించింది. చిన్న జట్లతో కలిసి క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొన్న విండీస్‌ బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌సిక్స్‌ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. స్కాట్లాండ్‌ బౌలర్లు షరీఫ్‌ (3/27), వీల్‌ (3/34), లీస్క్‌ (2/35) ధాటికి తడబడింది. 48.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. గేల్‌ తొలి బంతికే ఔటయ్యాడు. లూయిస్‌ (66), శామ్యూల్స్‌ (51) రాణించారు. ఛేదనలో స్కాట్లాండ్‌ కూడా తడబడింది. ఓ దశలో 105/5తో నిలిచింది.

రోచ్‌ (2/20) ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. బెరింగ్టన్‌ (33), మెక్‌లీడ్‌ (21) నిలవడంతో కోలుకుంది. నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించాక మెక్‌లీడ్‌ వెనుదిరిగినా బెరింగ్టన్‌ నిలిచాడు. ముస్నే (32 నాటౌట్‌)తో కలిసి ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించి ఔటయ్యాడు.

స్కాట్లాండ్‌ స్కోరు 105/5. ముస్నే... లీస్క్‌ (14 నాటౌట్‌)తో కలిసి స్కాట్లాండ్‌ను రేసులో నిలిపాడు. ఐతే ఆ జట్టు 31.4 ఓవర్లలో 125/5తో ఉన్న దశలో భారీ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. మళ్లీ ఆట మొదలెట్టే అవకాశమే లేకపోయింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో విండీస్‌ ఐదు పరుగుల తేడాతో నెగ్గింది. నిజంగా అదృష్టం విండీస్‌ వైపు నిలిచిందనే చెప్పాలి.

వాన వచ్చే సమయానికి అదే స్కోరు వద్ద స్కాట్లాండ్‌ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంటే.. డ/లూ పద్ధతిలో ఆ జట్టే ముందంజ వేసేది. స్కాట్లాండ్‌కు మరింత భాధ కలిగించే విషయమేంటంటే, ఐదో వికెట్‌గా వెనుదిరిగిన బెరింగ్టన్‌.. అంపైర్‌ తీసుకున్న ఓ తప్పుడు ఎల్బీ నిర్ణయానికి బలయ్యాడు. ఈ విజయంతో విండీస్‌ సూపర్‌సిక్సెస్‌లో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానం సాధించింది.

ఈ నెల 25న జరిగే ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడినా సాంకేతికంగా విండీస్‌కు ఇంకా ఆశలుండేవి. కానీ ఫైనల్లో స్థానం చాలా ప్రమాదంలో పడేది. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మరో బెర్త్ కోసం గురువారం జరుగబోయే జింబాబ్వే, యూఏఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం 5 పాయింట్లతో ఉన్న జింబాబ్వే, యూఏఈపై గెలిస్తే 7 పాయింట్లతో ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే..మార్చి 23న జరుగబోయే ఆఫ్ఘనిస్థాన్, ఐర్లండ్ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.

Story first published: Thursday, March 22, 2018, 10:32 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X