న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: సూపర్ 12: నాకౌట్ దెబ్బ: ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సిందే

West Indies playing XI vs Bangladesh: Lendl Simmons could make way for either of Roston Chase

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో నాకౌట్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయ్. ఇప్పటిదాకా ఒక్క గెలుపును అందుకోలేని జట్లు ఇంటి దారి పట్టడం మొదలైంది. ఈ మధ్యాహ్నం జరిగే మ్యాచ్- ఇలాంటిదే. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఓడిన జట్టు పెట్టే బేడా సర్దేయాల్సిందే. సూపర్ 12 రౌండ్‌ గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌ను గెలవలేదు.

నాకౌట్ దశను ఎదుర్కొంటోన్నాయి ఈ రెండు జట్లు కూడా. ఆడిన రెండింట్లోనూ చేదు ఫలితాలను ఎదుర్కొన్నాయి. బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరాభవాన్ని చవి చూసింది. జట్టు స్కోరు బోర్డును 170 పరుగులకు దాటించినా.. ఓటమి కోరల నుంచి బయటపడలేకపోయింది. రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయారు బంగ్లా టైగర్లు. వెస్టిండీస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఘోరంగా ఓడారు కరేబియన్ వీరులు.

ఒక్క గెలుపును కూడా అందుకోని ఈ రెండు జట్లు.. ఈ మధ్యాహ్నం తలపడనున్నాయి. షార్జా స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గెలిచిన జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కొనసాగుతుంది. ఓడిన జట్టు తిరుగుముఖం పడుతుంది. ఈ కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మెక్‌కోవె స్థానంలో జేసన్ హోల్డర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే- లెండిల్ సిమన్స్‌ను తప్పించి.. అతని స్థానంలో రోస్టర్ ఛేజ్‌ను చోటు కల్పించే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్ జట్టులో- సౌమ్యా సర్కార్ లేదా లిట్టన్ దాస్‌లల్లో ఒకరినే తుదిజట్టులోకి తీసుకుంటారు. నాసుమ్ అహ్మద్‌కు బదులుగా షమీమ్ హొస్సైన్‌ను ఆడించే చాన్స్ ఉంది. బంగ్లాదేశ్ టీమ్.. క్వాలిఫయర్ దశలో అదరగొట్టినప్పటికీ.. సూపర్ 12 రౌండ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఆ జట్టులో స్టార్ ప్లేయర్లు కూడా ఏ మాత్రం ప్రభావాన్ని చూపట్లేదు. ఆశించిన స్థాయిలో సత్తా చాటట్లేదు. ఫలితంగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ దారుణంగా ఓడింది.

వెస్టిండీస్ తుది జట్టులో ఎవిన్ లెవిస్, క్రిస్ గేల్, లెండిల్ సిమన్స్ లేదా రోస్టన్ ఛేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, నికొలస్ పూరన్, కీరన్ పొల్లార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, జేసన్ హోల్డర్ లేదా ఒషానె థామస్‌, అకిల్ హొసెన్, రవి రామ్‌పాల్‌ను తీసుకోవచ్చు. బంగ్లాదేశ్ టీమ్‌లో లిట్టన్ దాస్ లేదా సౌమ్యా సర్కార్, మహ్మద్ నయీం, షకీబుల్ హసన్, ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సైన్, నూరుల్ హసన్, మెహదీ హసన్, నాసుమ్ అహ్మద్/షమీమ్ హొస్సైన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షరీఫుల్ ఇస్లామ్‌ను ఆడటానికి అవకాశాలు ఉన్నాయి.

Story first published: Friday, October 29, 2021, 12:53 [IST]
Other articles published on Oct 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X