న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు వన్డేల సస్పెన్షన్‌కు గురైన వెస్టిండీస్ కోచ్

West Indies coach Stuart Law suspended for two ODIs against India

న్యూ ఢిల్లీ: భారత పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆడిన వెస్టిండీస్‌కు ఘోర పరాభవం జరిగింది. 0-2 తేడాతో క్లీన్‌స్వీప్‌కు గురవడంతో పాటు వెస్టిండీస్‌కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 21 నుంచి 5వన్డేల సిరీస్ మొదలుకానుండగా.. వెస్టిండీస్ కోచ్‌‌‌ స్టువర్ట్ లాపై రెండు వన్డేల సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఐసీసీ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

 రెండో టెస్టులో క్రమశిక్షణ తప్పిన స్టువర్ట్ లా

రెండో టెస్టులో క్రమశిక్షణ తప్పిన స్టువర్ట్ లా

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో స్టువర్ట్ లా క్రమశిక్షణ తప్పాడు. టీవీ అంపైర్ రూములోకి వెళ్లడంతో పాటు ఫోర్త్ అంపైర్‌పైనా అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై విచారించిన ఐసీసీ తాజాగా తీర్పుని ప్రకటించింది. దీంతో.. అక్టోబరు 21, 24న జరిగే వన్డేలకి కోచ్ దూరం కానున్నాడు.

3 డీమెరిట్ పాయింట్లని చేర్చిన ఐసీసీ

క్రమశిక్షణ తప్పిన స్టువర్ట్ లాకి 100 శాతం మ్యాచ్ ఫీజుని జరిమానాగా విధించడంతో అతని ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లని కూడా ఐసీసీ చేర్చింది. అయితే.. అతని ఖాతాలో అప్పటికే ఒక డీమెరిట్ పాయింట్ ఉండటం.. రెండేళ్లలోపు అవి నాలుగుకి మించడంతో.. రెండు మ్యాచ్‌ల వేటు తప్పలేదు. 2017, మే నెలలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలానే క్రమశిక్షణ తప్పి.. 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా చెల్లించుకోవడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

అది పోయేదాకా రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు: గంభీర్

బంతిని అంచనా వేయడంలో తడబడి

బంతిని అంచనా వేయడంలో తడబడి

ఉప్పల్ టెస్టులో భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన ఓపెనర్ కీరన్ పొవెల్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. అయితే.. స్లిప్‌లో రహానె క్యాచ్ అందుకునే సమయంలో బంతి నేలని తాకిందనే అనుమానం రావడంతో ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌కి నివేదించగా.. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

స్టువర్ట్ లా.. టీవీ అంపైర్ రూములోకి:

స్టువర్ట్ లా.. టీవీ అంపైర్ రూములోకి:

దీంతో.. కోపద్రిక్తుడైన స్టువర్ట్ లా.. నేరుగా టీవీ అంపైర్ రూములోకి వెళ్లాడు. అనంతరం ఫోర్త్ అంపైర్‌ సమీపంలో‌నూ నిల్చొని అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. దీంతో.. అంపైర్ల ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ విచారణ జరిపి ఐసీసీకి నివేదించాడు.

Story first published: Tuesday, October 16, 2018, 16:59 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X