న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది పోయేదాకా రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు: గంభీర్

 Till the Time I Have That Passion in me, I Will Keep Going: Gambhir Opens up on Retirement

న్యూ ఢిల్లీ: భారత జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశగా ఉన్నా.. దారులన్నీ మూసుకుపోయాయి. అయినా గౌతం గంభీర్‌కు రిటైర్‌మెంట్ ఆలోచనే లేదట. 37ఏళ్ల వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అడపాదడపా.. దేశీవాలీ ట్రోఫీల్లో మెరుస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న గౌతమ్ గంభీర్ తనదైన ప్రదర్శనను ఏ మాత్రం తగ్గనివ్వకుండా ఆడుతున్నాడు.

 ఢిల్లీ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించి

ఢిల్లీ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించి

ఇటీవల ముగిసిన క్వార్టర్స్ మ్యాచ్‌లో హర్యానా జట్టుపై కేవలం 72 బంతుల్లోనే 16ఫోర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. దీంతో.. 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఢిల్లీ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో.. మీడియాతో గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. విజయ్ హజారే ట్రోఫీలో పరుగులు చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. జట్టు కూడా వరుస విజయాలు సాధిస్తుండటంతో.. డ్రెస్సింగ్‌ రూమ్ వాతావరణం ఆహ్లాదకరంగా సాగిపోతోందని వెల్లడించాడు.

మారిపోయి ఐపీఎల్ కఠినమైన పోటీగా మారిపోయి

మారిపోయి ఐపీఎల్ కఠినమైన పోటీగా మారిపోయి

ఇక ఐపీఎల్‌లో చేదు అనుభవం అంటారా..? జట్టులోకి కొత్త ఆటగాళ్లు వస్తుంటారు. అలానే.. కొత్త సవాళ్లూ ఎదురవుతూ ఉంటాయి. 11 సీజన్లు ముగిసే సరికి జట్ల మధ్య ఐపీఎల్ చాలా కఠినమైన పోటీగా మారిపోయింది. ఒక ఆటగాడిగా నేను సాధించాల్సింది ఇక ఏమీ లేదు అని చెప్పను. ఇంకా ఏదో ఉంది.. ఆ దిశగా ఆటని ఆస్వాదిస్తూ అడుగులు వేస్తున్నా. అందుకే.. ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

6 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి

ఐపీఎల్ 2018 సీజన్‌‌ని ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా ఆరంభించిన గౌతమ్ గంభీర్.. పేలవ ఓటముల కారణంగా మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కెప్టెన్సీ నుంచి పక్కకి తప్పుకున్న తర్వాత.. సీజన్ ముగిసే వరకూ కనీసం తుది జట్టులో కూడా అతను చోటు దక్కించుకోలేకపోయాడు. భారత్ జట్టు తరఫున 2016, నవంబరులో చివరిసారిగా గౌతమ్ గంభీర్ మ్యాచ్ ఆడాడు.

ఇటీవలే రాజకీయ అరంగ్రేటం

ఇటీవలే రాజకీయ అరంగ్రేటం

తరచూ సోషల్ మీడియం ద్వారా యాక్టివ్‌గా కనిపించే గంభీర్.. ఇటీవల రాజకీయ అరంగ్రేటం చేశాడు. సామాజిక విషయాలపై స్పందిస్తూ.. హిజ్రాలు కూడా భారతీయ పౌరులేనని వారికి సైతం సమాదరణ కల్పించాలని ట్విట్టర్ వేదికగా పలుమార్లు పిలుపునిచ్చాడు.

Story first published: Tuesday, October 16, 2018, 16:28 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X