న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో టీమిండియా: బౌలింగ్‌లో బలం ఎవరిది?

West Indies bowling attack best this year; should Team India be worried?

న్యూ ఢిల్లీ: ఆసియా కప్ విజయానంతరం వెస్టిండీస్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇరు జట్ల మధ్య బ్యాటింగ్ బలగాన్ని మినహాయించి బౌలింగ్ దళాన్ని విశ్లేషిస్తే.. టీమిండియానే బలంగా ఉంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో 1-4తో టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన కోహ్లీసేన విండీస్‌పై గెలవాలని పట్టుదలతో ఉంది. ఇంగ్లీషు జట్టుతో ఆడిన తర్వాత ఆడుతున్న తొలి విదేశీ జట్టు ఇదే కావడంతో.. బాగా రాణించాలనే పట్టుదలతో ఉంది టీమిండియా.

కోహ్లీ లేకున్నా ఆసియాకప్‌లో భారత్‌ విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఎరుపు బంతి క్రికెట్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా జేసన్‌ హోల్డర్‌ నేతృత్వంలోని కరీబియన్‌ జట్టు బౌలింగ్‌ దాడిని ఎలా ఎదుర్కొంటుందనేది సందేహంగా ఉంది. అలాగని వెస్టిండీస్ బౌలింగ్‌ని తక్కువ అంచనా వేయలేం.

వెస్టిండీస్‌తో రెండో వన్డే జరిగేది వైజాగ్‌లోనేనా? వెస్టిండీస్‌తో రెండో వన్డే జరిగేది వైజాగ్‌లోనేనా?

విండీస్‌తో పోలిస్తే టీమిండియా బౌలింగ్ ‌దాడి చాలా చాలా బాగున్నా 2018లో గణాంకాలు మాత్రం ప్రత్యర్థికే అనుకూలంగా ఉన్నాయి. వారిని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది ఆడిన 5 టెస్టుల్లో కరేబియన్‌ బౌలర్ల బౌలింగ్‌ సగటు 18.04. మిగతా ఏ జట్టుతో పోల్చినా సగటు, స్ట్రైక్‌రేట్‌, ఇన్నింగ్స్‌ల్లో వికెట్ల విషయంలో వారిదే అగ్రస్థానం.

5 టెస్టుల్లో 94 వికెట్లు తీసిన ఆ జట్టు సగటు 18.04. స్ట్రైక్‌రేట్‌ 35.50. ఒక్కో ఇన్నింగ్స్‌కు వికెట్లు 9.40. టీమిండియా 9 టెస్టులాడి 158 వికెట్లు తీసింది. మిగతా గణాంకాలు 25.25, 35.50, 9.29గా ఉన్నాయి. సీమర్లకు అనూలించే పిచ్‌లపై భారత్‌ మంచి ప్రదర్శనే చేసింది. అయితే విండీస్‌ ఫేసర్లు 5 మ్యాచ్‌లలో 84 వికెట్లు తీశారు. సగటు 16.95. ఇక స్ట్రైక్‌రేట్‌ 32.70. భారత పేసర్లు 9 మ్యాచుల్లో 119 వికెట్లు పడగొట్టారు. సగటు 25.05, స్ట్రైక్‌రేట్‌ 48.40గా ఉంది.

Story first published: Wednesday, October 3, 2018, 14:48 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X