న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యంత చెత్త రికార్డు: 95 నిమిషాలు.. 45 బంతులు.. 0 పరుగులు

West Indies Bowler Miguel Cummins enters record books with 45-ball duck

ఆంటిగ్వా: భారత్, విండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత చెత్త రికార్డు నమోదయింది. విండీస్ బౌలర్ మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లికించుకున్నాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్.. 45 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. దీంతో అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన విండీస్ క్రికెటర్‌గా మిగెల్ నిలిచాడు.

<strong>ఒకే మ్యాచ్‌: బ్యాట్‌తో 134 పరుగులు.. బంతితో 8 వికెట్లు!!</strong>ఒకే మ్యాచ్‌: బ్యాట్‌తో 134 పరుగులు.. బంతితో 8 వికెట్లు!!

45 బంతులు ఆడి డకౌట్‌:

45 బంతులు ఆడి డకౌట్‌:

ఎక్కువ బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన విండీస్ ఆటగాళ్ల జాబితాలో కమిన్స్ మొదటి జాబితాలో ఉన్నాడు. కె. అర్ధర్‌టన్, ఎం.డిల్లాన్, సి.బట్స్, ఆర్.ఆస్టిన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2002లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో అర్థర్‌టన్ 40 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. అదే 2002లో షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డిల్లాన్ 29 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. 1988లో భారత్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో బట్స్ 27 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరగా.. అత్యధికంగా కమిన్స్‌ 45 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు.

విసిగించిన కమిన్స్‌:

విసిగించిన కమిన్స్‌:

కమిన్స్‌ 95 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండటం గమనార్హం. చివరకు స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 189/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌.. మరో 33 పరుగులు జత చేసి 222 వద్ద ఆలౌట్‌ అయింది. చివరి రోజు కెప్టెన్ జాసన్ హోల్డర్‌ (39), కమిన్స్‌ అడ్డుగా నిలిచి భారత బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా కమిన్స్‌ అద్భుత డిఫెన్స్‌తో వికెట్‌ చేజార్చుకోకుండా తొలి గంట పాటు బ్యాటింగ్ చేసాడు. అయితే 74వ ఓవర్‌లో షమీకి దొరికిపోవడంతో హోల్డర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ మరుసటి ఓవర్‌లోనే కమిన్స్‌ను జడేజా బౌల్డ్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. గంగూలీ-సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ-రహానే

తొలి టెస్టుపై భారత్‌ పట్టు:

తొలి టెస్టుపై భారత్‌ పట్టు:

తొలి టెస్టులో భారత్‌ పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (51 బ్యాటింగ్‌), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (53 బ్యాటింగ్‌)లు రాణించడంతో భారత్‌ భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ, రహానే హాఫ్‌ సెంచరీలతో అజేయంగా నిలవడంతో.. భారత్‌ 72 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్‌ 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆదివారం భారత్‌ రెండు షెషన్ల పాటు దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని విండీస్‌ ముందు ఉంచితే విజయం సాధించవచ్చు.

Story first published: Sunday, August 25, 2019, 16:11 [IST]
Other articles published on Aug 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X