న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనోళ్లు విజేతలుగానే భారత్ కు తిరిగొస్తారు : గంగూలీ

We will find out if this is the best bowling attack or not

హైదరాబాద్: మన బౌలర్ల సత్తా ఏంటో అక్కడే చూపిద్దాం. అంటున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు వచ్చాడు. మ్యాచ్ అనంతరం అక్కడ జరిగిన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.

రాబోయే దక్షిణాఫ్రికా టూర్‌లో మన వాళ్ల బౌలింగ్‌లో ఎంతవరకు రాణించగలరనే సందేహం అందరికీ ఉందని అభిప్రాయపడ్డాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో విరాట్ కోహ్లీ సేన టూర్‌కు సన్నద్దమౌతుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని కొనియాడాడు.

మన బౌలింగ్ ఎలా ఉండబోతుందో మున్ముందు మీరే చూస్తారు

భారత్ జట్టుపై పూర్తి నమ్మకమున్న గంగూలీ ..మీరే చూడండి. మన వాళ్లు బౌలింగ్ ఎలా చేస్తారనేది అని నిర్ధారించాడు. బౌలింగ్ చేయడానికి భారత్ జట్టులో ఐదుగురు ఫేసర్‌లు సిద్ధంగా ఉన్నారు. మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నారు. వీళ్లతో పాటుగా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా తన బౌలింగ్‌తో మాయాజాలం చేయనున్నాడు.

రహానే మంచి నాణ్యమైన ఆటగాడు

శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అజింకా రహానే దారుణమైన స్కోరు చేశాడని అడిగిన ప్రశ్నకు స్పందించిన గంగూలీ.. మూడు టెస్ట్‌లలో 17పరుగులు చేయడంతో అతను ఆడలేడని అనుకోవద్దంటూ బదులిచ్చాడు. సఫారీ పిచ్‌లపై రాణించడం ఖాయమన‍్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టులో విరాట్‌ కోహ్లి, చతేశ్వర పుజరా, రహానే, మురళీ విజయ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. వారి విజేతలుగానే భారత్‌కు తిరిగొస్తారని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 13:24 [IST]
Other articles published on Dec 19, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X