న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిట్‌నెస్‌లో కోహ్లీ, రోహిత్‌లే స్ఫూర్తి: యువ ఆటగాళ్లు

We want to be as fit as Virat and Rohit bhai, says Indian teams young brigade

హైదరాబాద్: ఫిట్‌నెస్ విషయంలో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలే తమకు స్ఫూర్తి అని టీమిండియా యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్‌లు అన్నారు. గత రెండేళ్లుగా జట్టులో కొనసాగుతున్న చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గిల్, ఖలీల్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు.

India vs New Zealand: 4వ వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియాIndia vs New Zealand: 4వ వన్డేలో చిత్తుగా ఓడిన టీమిండియా

చాహల్‌తో కలిసి బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో వీరిద్దరూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ కాలంలో తన ప్రదర్శన మెరుగవడానికి టీమిండియా పాటిస్తున్న కఠినమైన ఫిట్‌నెస్ నిబంధనలే కారణమని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

1
44083

ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను క్రమం తప్పకుండా

"నేను చాలా వర్కౌట్లు చేస్తా. మంచి ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమిస్తా. మాకు ఇచ్చిన ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను క్రమం తప్పకుండా అనుసరించడం చాలా ఉపయోగపడింది. విరాట్, రోహిత్ బాయ్.. యువకులను బాగా ప్రోత్సహిస్తారు. వాళ్లు ఏదైతే చేస్తారో దానిని చూసి స్ఫూర్తిపొందుతాం. మా శక్తి మేరకు మరింత ఎక్కువగా కష్టపడేందుకు ప్రయత్నిస్తాం" అని కుల్దీప్ అన్నాడు.

వర్కౌట్లను ఓ హాబీలాగా మార్చుకోవాలి

వర్కౌట్లను ఓ హాబీలాగా మార్చుకోవాలి

జట్టుకు అవసరమైనప్పుడల్లా బరిలోకి దిగేందుకు ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్ నిబంధనలు బాగా ఉపయోగపడుతున్నాయని ఖలీల్ చెప్పాడు. "అవకాశం వచ్చిందంటే మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకోసం మనం కూడా ఫిట్‌నెస్ కాపాడుకోవాలి. రోజూ ఎలా బ్రష్‌ చేసుకుంటామో.. వర్కౌట్లను ఓ హాబీలాగా మార్చుకోవాలి" అని ఖలీల్ అహ్మద్ తెలిపాడు.

ఫిట్‌నెస్ స్థాయి మరింత మెరుగుపడింది

ఫిట్‌నెస్ స్థాయి మరింత మెరుగుపడింది

మనం శరీరాన్ని కాపాడుకుంటేనే ఓ ఆటగాడిగా సుదీర్ఘకాలం ఆటలో కొనసాగుతామని ఖలీల్ పేర్కొన్నాడు. మరోవైపు తనకు ఇచ్చిన ఫిట్‌నెస్ షెడ్యూల్‌ను తప్పకుండా అనుసరించడం వల్లే, తన ఫిట్‌నెస్ స్థాయి మరింత మెరుగుపడిందని గిల్ అన్నాడు. భారత జట్టులో చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉందని గిల్ చెప్పాడు.

Story first published: Thursday, January 31, 2019, 12:58 [IST]
Other articles published on Jan 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X