న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్‌ మంచి ఆటగాడు.. ఎవరైనా అంగీకరించాల్సిందే'!!

IND VS AUS 2020 : Batting Coach Vikram Rathour Hails Rishabh Pant || Oneindia Telugu
We’ve spoken a lot about him, India batting coach irked on question about Rishabh Pant

ముంబై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మంచి ఆటగాడు. ఆ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే అని బ్యాటింగ్ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అన్నాడు. పంత్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాడు. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు అని ఆయన తెలిపాడు. ఇక పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై విక్రమ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. శార్దూల్‌ కష్టానికి ప్రతిఫలం దక్కింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు అని చెప్పుకొచ్చాడు.

పాంటింగ్‌ జోస్యం..ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుంది!!పాంటింగ్‌ జోస్యం..ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుంది!!

పంత్‌ మంచి ఆటగాడు:

పంత్‌ మంచి ఆటగాడు:

'ఇటీవల జరిగిన మీడియా సమావేశాల్లో పంత్‌ గురించి మేం ఎంతో మాట్లాడాం. నేను కూడా అతడి గురించి ప్రశ్నలు ఎదుర్కొన్నా. పంత్ మంచి ఆటగాడు. ఆ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. ప్రస్తుతం పంత్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాడు. దాని కోసం శ్రమిస్తున్నాడు. బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఇటీవల మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. భవిష్యత్తులో మరింత నిలకడగా రాణిస్తాడు' అని విక్రమ్‌ తెలిపాడు.

శార్దూల్‌ కష్టానికి ప్రతిఫలం దక్కింది:

శార్దూల్‌ కష్టానికి ప్రతిఫలం దక్కింది:

వెస్టిండీస్, శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో బ్యాటింగ్‌లో చెలరేగిన శార్దూల్‌లపై విక్రమ్‌ మాట్లాడాడు. 'కీలక మ్యాచులలో శార్దూల్‌ బాగా ఆడాడు. తన కష్టానికి ప్రతిఫలం అది. నిజం చెప్పాలంటే శార్దూల్‌కు గొప్ప సహాయాలు ఏమీ చేయలేదు. అతడిలో బ్యాటింగ్‌ సత్తా ఉందని అందరికీ తెలుసు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు. మరిన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతాడని నేను నమ్మకంగా ఉన్నా' అని విక్రమ్‌ పేర్కొన్నాడు.

యువ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చాం:

యువ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చాం:

'ఇటీవల ఆడిన మ్యాచుల్లో మూడో స్థానంలో యువ బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇచ్చాం. శ్రేయాస్, దూబే, పంత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకువచ్చారు. వారికి సమయం ఇవ్వాలని అలా ప్రయత్నించాం. కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ అటగాళ్లుకు అండగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతాం. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చాలనుకోవట్లేదు. ఇక రెండు, మూడు మ్యాచుల్లో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాం' అని విక్రమ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, January 13, 2020, 11:57 [IST]
Other articles published on Jan 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X