న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ కోసం 18 మంది.. ఐపీఎల్‌లో రొటేషన్ పద్ధతిలో ఆడిస్తాం: ఎమ్మెస్కే

World Cup 2019: MSK Prasad Reveals World Cup Plans | Oneindia Telugu
We have shortlisted 18 players and will rotate them: MSK Prasad reveals World Cup plans

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది.

ఆస్ట్రేలియాతో రెండు టీ20లకు జట్టులో చోటు: ఎవరీ మయాంక్ మార్కండేఆస్ట్రేలియాతో రెండు టీ20లకు జట్టులో చోటు: ఎవరీ మయాంక్ మార్కండే

న్యూజిలాండ్‌ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. దీంతో విరాట్‌ కోహ్లీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.

జట్టు ప్రకటన అనంతరం

జట్టు ప్రకటన అనంతరం

జట్టు ప్రకటన అనంతరం టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసే 18 మంది ఆటగాళ్ల పనిభారాన్ని పర్యవేక్షిస్తామని వెల్లడించాడు. ఈ విషయంపై బీసీసీఐ.. ఆయా ఫ్రాంచైజీలతో చర్చలు జరుపుతున్నదని అన్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఆటగాళ్లు గాయపడకుండా ఉండాలంటే వాళ్లపై పని భారాన్ని తగ్గించాలని అన్నాడు.

ఎమ్మెస్కే మాట్లాడుతూ

ఎమ్మెస్కే మాట్లాడుతూ

ఎమ్మెస్కే మాట్లాడుతూ "వరల్డ్‌కప్ కోసం మేం 18 మందితో కుదించిన జాబితాను రూపొందిస్తాం. ఐపీఎల్‌లో వాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తాం. వారిలో నుంచి మెగా ఈవెంట్ కోసం జట్టును సిద్ధం చేస్తాం. పని భారాన్ని ఎలా పంచుకోవాలన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో దీనిపై సమగ్రంగా చర్చ జరిపి అన్ని విషయాలను వెల్లడిస్తాం" అని అన్నాడు.

స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి

స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి

"అయితే స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నకు గాను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ "ఈ విషయంపై ఫ్రాంచైజీలు కూడా ఆందోళనలోనే ఉన్నాయి. కానీ వాళ్లను ఒప్పించేలా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది వరల్డ్‌కప్ ఏడాది" అని అన్నారు.

ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి

ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి

"కొన్ని ఫ్రాంచైజీలు వాళ్ల సమస్యలను కూడా చెబుతున్నాయి. వాటిని బహిర్గతం చేయదల్చుకోలేదు. ఏదేమైనా ఫ్రాంచైజీలు దేశ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్రాంచైజీలన్నీ భారత్‌కు చెందినవే అనే విషయాన్ని కూడా మరువొద్దు. అంతర్జాతీయ స్థాయిలో మన జట్టు మెరుగ్గా ఆడితే అందరికీ బాగుంటుంది" అని అమితాబ్ చౌధరి వ్యాఖ్యానించాడు.

Story first published: Saturday, February 16, 2019, 11:18 [IST]
Other articles published on Feb 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X