న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విండిస్‌తో మ్యాచ్ తేలిగ్గా తీసుకోం... ఖచ్చితమైన ప్రణాళికతోనే బరిలోకి'

We have a plan for Andre Russell: Yuzvendra Chahal warns West Indies

హైదరాబాద్: ఒత్తిడిని అధిగమిస్తేనే వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీల్లో విజయం సాధించగలుగుతామని చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌తో తలపడనుంది. గురువారం జరగనున్న ఈ మ్యాచ్‌కి మాంచెస్టర్‌ వేదిక కానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది

రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది

వెస్టిండిస్ అంటేనే క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మెయిర్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్లు గుర్తుకొస్తారు. ఈ నేపథ్యంలో విండిస్‌ జట్టును కట్టడి చేయడంపైనే దృష్టి సారించామని యజువేంద్ర చాహల్ తెలిపాడు. చాహల్ మాట్లాడుతూ "దేశం కోసం ఆడటం వేరు. ఐపీఎల్‌ వంటి లీగ్‌లో ఆడటం వేరు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది" అని అన్నాడు.

వరల్డ్‌కప్‌కు ఎంతమాత్రం పోలిక లేదు

వరల్డ్‌కప్‌కు ఎంతమాత్రం పోలిక లేదు

"ఐపీఎల్‌కు వరల్డ్‌కప్‌కు ఎంతమాత్రం పోలిక లేదు. దేశం తరఫున సమిష్టిగా ఆడటంపైనే మా దృష్టి ఉంది. ఒత్తిడిని అధిగమిస్తేనే వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీల్లో విజయం సాధిస్తాం. విండిస్ చాలా ప్రమాదకరమైన జట్టు. ప్రస్తుతం ఆ జట్టు విజయం కోసం పరితపిస్తోంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ జట్టులోని ఆటగాళ్లు ఫామ్‌ను చాటుకుని తిరిగి గాడిలో పడటానికి యత్నిస్తారు" అని చాహల్ తెలిపాడు.

సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం

సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం

దీంతో విండిస్‌తో జరిగే మ్యాచ్‌లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతామని చాహల్ తెలిపాడు. ఇక, రసెల్‌ కోసం ఏమైనా ప్రణాళిక సిద్ధం చేశారా? అని అడిగిన ప్రశ్నకు చాహల్‌ అవుననే సమాధానమిచ్చాడు. రసెల్ కోసం గేమ్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు చాహల్ చెప్పుకొచ్చాడు. "అతనొక హార్డ్‌ హిట్టర్‌. మేము చాలా మ్యాచ్‌ల్లో అతనికి బంతులు వేశాం. అతని ఆట తీరుపై అవగాహన ఉంది" అని చాహల్‌ తెలిపాడు.

7 వికెట్లు తీసిన చాహల్

7 వికెట్లు తీసిన చాహల్

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వెస్టిండిస్ ఆడిన గత మ్యాచ్‌కు ఆండ్రీ రసెల్ దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో యజువేంద్ర చాహల్ 5.45 ఎకానమీ రేట్‌తో 7 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Monday, June 24, 2019, 18:12 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X