న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవకాశాలను అందుకోలేకపోయాం: ఇంగ్లీషు గడ్డపై ఓటమిపై కోహ్లీ

India vs England 5th Test : Virat Kohli Says We Fought Till The End
We did not capitalise on important moments: Virat Kohli

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-4తో కోల్పోయినా... అసలు సిసలు టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు సెంచరీలతో చెలరేగడంతో ఒకానొక దశలో అభిమానులకు విజయంపై ఆశలు రేగాయి.

అయితే, ఆ తర్వాత వారిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు 118 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "విదేశీ పిచ్‌లపై భారత్ రాణించలేదన్న అపవాదు గురించి ఆలోచించడం లేదు. నిజానికి ఈ సిరిస్‌లో లార్డ్స్‌ టెస్టు మినహా మేం మిగతా మ్యాచ్‌లు బాగానే ఆడాం. మాకు లభించిన అవకాశాలను అందుకోలేకపోయాం" అని కోహ్లీ అన్నాడు.

{cricket_250-2018_42378}

1
42378

ఓడినా ఈ సిరీస్‌ హోరాహోరిగా సాగింది

"ఓడినా ఈ సిరీస్‌ హోరాహోరిగా సాగింది. ఇంగ్లండ్‌ కూడా మా కంటే మెరుగ్గా రాణించింది. అసలైన టెస్ట్‌ క్రికెట్‌ మజాను ఈ సిరీస్‌ అందించింది. రాహుల్‌, పంత్‌ల బ్యాటింగ్‌ అద్భుతం. పంత్‌ పోరాటపటిమ ఆకట్టుకుంది. అతనిపై మాకు నమ్మకం ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌ భవిష్యత్తు" అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

శామ్ కర్రన్ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడు

శామ్ కర్రన్ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడు

"ఇక శామ్ కర్రన్ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడు. మొదటి, నాలుగో టెస్ట్‌లో అతను ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడు. ఇరు జట్లు విజయం కోసం పోటీపడటంతో అభిమానుల మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు" అని కోహ్లీ తెలిపాడు.

కుక్ కెరీర్ గొప్పగా సాగింది

కుక్ కెరీర్ గొప్పగా సాగింది

ఇక, ఈ టెస్టు మ్యాచ్‌తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలెస్టర్‌ కుక్‌ గురించి కోహ్లీ మాట్లాడుతూ "అతని కెరీర్‌ గొప్పగా సాగింది. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా" అని అన్నాడు. ఆఖరి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్‌ 149), రిషభ్‌ పంత్‌ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114) సెంచరీలతో గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించారు.

ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యం

ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యం

ఒకానొక దశలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది. ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది. కీలక సమయంలో ఆదిల్‌ రషీద్‌ (2/63) చక్కటి బంతితో రాహుల్‌ను ఔట్‌ చేసి భారత్‌ ఆశలకు తెరదించాడు. ఆ వెంటనే పంత్‌నూ పెవిలియన్‌ పంపి ఆతిథ్య జట్టుకు విజయాన్ని అందించాడు. 17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 345 పరుగులకే ఆలౌటైంది.

ఆఖరి టెస్టులో 118 పరుగులతో ఓడిపోయిన టీమిండియా

ఆఖరి టెస్టులో 118 పరుగులతో ఓడిపోయిన టీమిండియా

దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌ (3/45), శామ్ కర్రన్‌ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్‌ 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో బ్యాట్‌తో మెరిసిన కోహ్లీ కెప్టెన్సీలో విఫలమయ్యాడని, తుది జట్టు ఎంపికలో తడబడ్డాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Story first published: Wednesday, September 12, 2018, 14:50 [IST]
Other articles published on Sep 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X