న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీ జట్టుతోనే మా ప్రాక్టీస్.. ప్రపంచ కప్పే టార్గెట్

We Are Focused on Winning a World Title, Says Jhulan Goswami

హైదరాబాద్: ప్రపంచకప్‌ గెలవడంపైనే తాము దృష్టి పెట్టామని భారత మహిళల క్రికెట్‌ జట్టు వెటరన్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి చెప్పింది. ప్రపంచకప్‌కు మరో ఏడాదిపాటే సమయం ఉంది కాబట్టి టీమిండియా ఇప్పటి నుంచే సన్నద్ధత మొదలుపెట్టిందని అభిప్రాయపడ్డారు. కాలి మడమ గాయంతో ఆమె దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరిగి రావలసి వచ్చింది.

'వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ కోసం దక్షిణాఫ్రికా సిరీస్‌తోనే మా సన్నద్ధత మొదలైపోయింది. ఇంకా గడువు సంవత్సరమే ఉన్నందున ఈ మెగా టోర్నీకి సిద్ధం కావడానికి మాకు సమయం సరిపోతుంది. ప్రపంచకప్‌లో రాణించడమే మా లక్ష్యం. ఈ మెగా టోర్నీ ప్రతి ఏడాదీ రాదు. ఈ కప్‌ సాధిస్తే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచినట్లే ' అని జులన్‌ చెప్పింది.

ఇప్పటి వరకు మహిళల జట్టు ప్రపంచకప్‌ గెలువలేదు. గతేడాది అడుగుదూరంలో కప్‌ను చేజార్చుకున్న భారత అమ్మాయిలకు ఈ ఏడాది నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ రూపంలో మరో అవకాశం రానుంది. ప్రస్తుతానికి మా లక్ష్యం ఈ టోర్నీలో టాప్‌-4లో నిలవడమే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లు పాల్గొనే ముక్కోణపు టీ20 సిరీస్‌ ఉంది

'నా కెరీర్‌ ప్రారంభించినప్పుడే ప్రపంచకప్‌ గెలవాలనే కోరిక నా మెదడులో నాటుకుపోయింది. నాలుగేళ్ల కోసారి వచ్చే ఈ టోర్నీ గెలుపు ఒలింపిక్‌ బంగారు పతకంతో సమానం. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సెమీస్‌కు వెళ్లడమే మా లక్ష్యమైనప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచకప్‌ సాధించడమే.' అని 16 ఏళ్లుగా క్రికెట్‌ ఆడుతున్న గోస్వామి తెలిపారు.

Story first published: Friday, February 16, 2018, 12:18 [IST]
Other articles published on Feb 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X