న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాకు టెస్ట్ క్రికెట్ చాలా సరదాగా ఉందండి.. మ్యాచ్ తర్వాత జానీ బెయిర్ స్టో, జో రూట్ కామెంట్లు

We Are Feeling Fun About How We Playing in a Test says Joe Root And Jonny Bairstow

ఎడ్జ్‌బాస్టన్‌లో రీషెడ్యూల్ చేసి అయిదో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విధించిన 378పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించిందంటే అందుకుకారణం.. జానీ బెయిర్ స్టో, జో రూట్. వీరిద్దరు కలిసి 269పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించారు. ఇక వీరిద్దరు సెంచరీలతో చెలరేగి నాటౌట్‌గా నిలిచి విజయ లాంఛనాన్ని ముగించారు. ఈ మ్యాచ్ అనంతరం వీరిద్దరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక జానీకి ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాగా.. జో రూట్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

 ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనుకుంటా

ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనుకుంటా

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ..' ప్రస్తుతానికి చాలా సరదాగా ఉంది. మా టీంమేట్స్‌కు గత నెల రోజులు చాలా అద్భుతంగా గడిచాయి. గత కొన్ని సంవత్సరాలుగా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ గత కొన్ని నెలలుగా మంచి ఫామ్ కనబర్చుతున్నాను. ఈ విజయానికి జట్టులోని ప్రతి ఒక్కరు అర్హులే. అలాగే స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు. అయిదో రోజు గంటన్నరలో ముగించేశాం. నాకు ఇక చాలా ఆనందంగా ఉంది. నేను వైఫల్యానికి అస్సలు భయపడను. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనుకుంటాను.' అని జానీ తెలిపాడు.

రూట్, నేను నుంచి దోస్తులం

రూట్, నేను నుంచి దోస్తులం

' మేము గతంలో కలిగి ఉన్న టెస్ట్ మ్యాచ్ విధానం వల్ల మేము మ్యాచ్‌లు కోల్పోయాం. కానీ మా వే ఆఫ్ థింకింగ్ మారింది. క్రికెట్ యొక్క సరదా బ్రాండ్ ఇది. ఇక మా ఛేజింగ్ విషయానికొస్తే.. అంతా మా చేతుల్లోనే ఉన్నట్లు అనిపించింది. ఇండియాకు ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు కానీ ఎవరైనా సరే హిట్టింగ్ చేస్తుంటే కాస్త ఒత్తిడికి గురవుతారు. మేం అదే చేయగలిగాం. వారు కూడా మా తరహా గేమ్ ఆడబోయే కాలం ముందుంది. రూట్, నేను ఏళ్ల నుంచి దోస్తులం. ఇద్దరం యార్క్‌షైర్‌కు చెందిన కుర్రాళ్లం. మేము యార్క్‌షైర్ అకాడమీ రోజుల నుండి ఇప్పుడు టెస్ట్ జట్టు వరకు కలిసి ఆడటం చాలా బాగుంది. ఇక కలిసి మ్యాచ్ ముగించడం ఇంకా బాగుంది. అతనితో కలిసి ఆడటం ఎప్పుడు ప్రత్యేకమేనని చెప్పాలి.' అని బెయిర్ స్టో అన్నాడు.

ఎంత సరదాగా గెలుస్తున్నామో..

ఎంత సరదాగా గెలుస్తున్నామో..

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ జో రూట్‌ మాట్లాడుతూ.. 'ఇలా ఆడడాన్ని చాలా ఇష్టపడుతున్నా. పిచ్, వాతావరణం అన్నీ బాగున్నాయి. ఇక గత నాలుగైదు వారాలుగా మా టీంమేట్స్ ఎంత సరదాగా టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతు గెలుస్తున్నామో మీరు చూస్తునే ఉన్నారు. మేము ఛేజింగ్‌లో చాలా బాగా రాణిస్తున్నాం. మాకు మా మీద పూర్తి నమ్మకం ఉంది. అలాగే సంపూర్ణ స్పష్టత కూడా ఉంది. ఎప్పుడూ కూడా ఆట నుంచి తప్పుకోవాలని మేం అనుకోవట్లేదు. చాలా మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లు జట్టులో ఉన్నారు. ఇక మా కెప్టెన్ స్టోక్స్‌కు మా అందరి మద్దతు ఉంటుంది.' అని రూట్ తెలిపాడు.

 జానీ ఉన్నంత సేపు స్టేడియం ఎంత సందడిగా ఉంటుందో..

జానీ ఉన్నంత సేపు స్టేడియం ఎంత సందడిగా ఉంటుందో..

ఇక మ్యాచ్ చూడ్డానికి వచ్చిన అందరికి వినోదాన్ని అందించడం కూడా మా బాధ్యతగా మేం ఫీలయ్యాం. ఇక స్టోక్స్ ద్వారా ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం. టెస్ట్ క్రికెట్లో ఇలాంటి వినోదం మనం అరుదుగా చూస్తుంటాం. మేం టెస్ట్ క్రికెట్‌ను కూడా వీలైనంత సరదాగా ఉంచాలనుకుంటున్నారు. చూడండి జానీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో.. అతను ఉన్నంత సేపు స్టేడియంలో ఎంతో సందడిగా ఉంటుంది. ఇలాంటి విషయాలు చూడ్డానికి చాలా ఆనందమేస్తుంది. ఒక జట్టుగా కెరీర్‌లో మాకు అత్యంత ఆనందదాయకమైన రోజులని చెప్పుకొవచ్చు. న్యూజిలాండ్ మీద అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన తర్వాత మేము మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. ఛేజింగ్లో మా జట్టులోని ఇద్దరు ఓపెనర్లు మాకు అందించిన ఆరంభం అద్భుతంగా ఉంది. ఇక ఇండియా బౌలర్లు మాపై మళ్లీ ఒత్తిడిని పెంచారు. కానీ మేం కుదురుకున్నాక ఛేజింగ్ సులభతరం అయింది.' అని రూట్ స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, July 5, 2022, 22:07 [IST]
Other articles published on Jul 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X