న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టెస్టులో డబుల్ సెంచరీ: జో రూట్ 'స్లో' బ్యాటింగ్‌పై విమర్శలు

Watching Joe Root bat is like watching paint dry: Fidel Edwards slams England captain

హైదరాబాద్: హామిల్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు గాను వెస్టిండీస్ పేసర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో 441 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో రూట్‌ 226 పరుగులు చేశాడు. 14 ఇన్నింగ్స్‌ల తర్వాత జో రూట్ టెస్టు సెంచరీని సాధించాడు. రూట్‌కు మూడో డబుల్‌ సెంచరీ. జో రూట్ డబుల్ సెంచరీ ఇంగ్లాండ్‌కు 101 పరుగుల ఆధిక్యాన్ని ఇవ్వడంతో పాటు జో రూట్‌ని ప్రత్యేకంగా నిలిపింది.

వరుసగా 14 టెస్టుల్లో ఓటమి.. పాకిస్థాన్‌ ఖాతాలో చెత్త రికార్డు!!వరుసగా 14 టెస్టుల్లో ఓటమి.. పాకిస్థాన్‌ ఖాతాలో చెత్త రికార్డు!!

జో రూట్‌ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు

జో రూట్‌ బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు

అయితే, డబుల్ సెంచరీ చేసిన జో రూట్‌పై ప్రశంసల వర్షం కురిపించడం అటుంటి అతడి బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వెస్టిండిస్ పేసర్ ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌ జో రూట్‌ది బోరింగ్ బ్యాటింగ్ అంటూ ఎద్దేవా చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో "నీ బ్యాటింగ్‌ స్లోగా ఉండటం వల్లే గేమ్‌ కూడా నత్తనడకన సాగింది. ఒక బోరింగ్‌ బ్యాటింగ్‌ అది" ట్వీట్ చేశాడు.

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా

మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనియాడబడుతున్న జో రూట్‌కు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన జో రూట్ 36.85 యావరేజితో 774 పరుగులు చేశాడు. హామిల్టన్ టెస్టులో డబుల్ సెంచరీయే ఈ ఏడాది జో రూట్ అత్యత్తమం కావడం విశేషం.

ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ

ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ

రెండో టెస్టులో ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ జో రూట్ స్లో బ్యాటింగ్ కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను న్యూజిలాండ్ 1-0తో గెలుచుకుంది. తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

డ్రాగా ముగిసిన రెండో టెస్టు

డ్రాగా ముగిసిన రెండో టెస్టు

చివరి రోజు ఆటలో భాగంగా రాస్‌ టేలర్‌(105 నాటౌట్‌), కెప్టెన్‌ విలియమ్సన్‌( 104 నాటౌట్‌)లు సెంచరీలు సాధించిన తర్వాత వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు కుమార ధర్మసేన, పాల్‌ విల్సన్‌లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Story first published: Tuesday, December 3, 2019, 12:15 [IST]
Other articles published on Dec 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X