న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్‌గా మారిపోయిన పృథ్వీ షా: సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ (వీడియో)

WATCH: Young Prithvi Shaw already a sensation in Australia, SCG crowd stops him for selfie and autograph

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే, తొలి టెస్టుకు ముందే యువ ఓపెనర్ పృథ్వీ షా‌ ఓ స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు.

<strong>ముగ్గురిలో ఎవరు?: ఆ ఇద్దరికే ఓపెనర్లుగా ఓటేసిన సెహ్వాగ్</strong>ముగ్గురిలో ఎవరు?: ఆ ఇద్దరికే ఓపెనర్లుగా ఓటేసిన సెహ్వాగ్

సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో గురువారం ఆరంభమైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ(66: 69 బంతుల్లో 11 ఫోర్లు) రాణించిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(3) ఔటై నిరాశపరిచినప్పటికీ, షా మాత్రం దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించాడు.

సచిన్ టెండూల్కర్‌ని తలపించిన షా

పృథ్వీ షా‌ షాట్ సెలక్షన్ ఆట తీరు అచ్చం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని తలపించింది. కాగా, ఈ మ్యాచ్‌‌కి ముందు కాసేపు ప్రాక్టీస్ చేసిన పృథ్వీ షా అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తుండగా అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

 అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా సెంచరీ

అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే పృథ్వీ షా సెంచరీ

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రెండో టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ సిరీస్‌‌లో 118.50 సగటుతో 237 పరుగులు చేసి అందరి మన్ననలను అందుకున్నాడు.

 డిసెంబరు 6 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్

డిసెంబరు 6 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్

ఆసీస్ గడ్డపై డిసెంబరు 6 నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేస్తే పృథ్వీ షా‌కి కెరీర్‌లో తిరుగుండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై పృథ్వీ షా సత్తాచాటాలని అభిమానులు భావిస్తున్నారు. కాగా, వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలతో రాణించారు.

వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పృథ్వీ షా

ఓపెనర్ పృథ్వీ షా (66: 69 బంతుల్లో 11 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (64: 87 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), పుజారా (54: 89 బంతుల్లో 6 ఫోర్లు) రహానే (56 రిటైర్డ్ ఔట్), హనుమ విహారి (53) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 92 ఓవర్లలో 358 పరుగులకి ఆలౌటైంది. నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌‌లో వర్షం కారణంగా బుధవారం తొలిరోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే.

 భారత్ టెస్టు జట్టు:

భారత్ టెస్టు జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Thursday, November 29, 2018, 18:52 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X