న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమ్ సౌథీ Vs డేవిడ్ వార్నర్: పెర్త్ టెస్టులో మాటల యుద్ధం, అసలేం జరిగింది?

WATCH: You are supposed to be Mr. nice guy, David Warner gets involved in heated argument with Tim Southee

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మైదానంలో సౌమ్యంగా ప్రవర్తించే క్రికెట్ జట్లలో న్యూజిలాండ్ ఒకటి. న్యూజిలాండ్ ఆటగాళ్లు మైదానంలో ఎప్పుడూ సౌమ్యంగా, సరళంగా ఉండేందుకే ఇష్టపడతారు. కానీ, ఇటీవలి కాలంలో ఆ జట్టులోని పలువురు ఆటగాళ్ళు ప్రత్యర్ధి జట్లతో గొడవకు దిగుతున్నారు.

పెర్త్ వేదికగా గురువారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు అలాంటి ఒక సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఈ క్రమంలో కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథిపై ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌‌ ఓడో ఓవర్‌లో చోటు చేసుకుంది.

డబ్ల్యూటీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సొంతం చేసుకున్న ఆష్లే బార్టీడబ్ల్యూటీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సొంతం చేసుకున్న ఆష్లే బార్టీ

ఆసీస్ ఓపెనర్ జోయ్ బర్న్స్‌పై టిమ్ సౌథి బంతి విసరడంతో వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వార్నర్-సౌథీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే..

టీమ్ సౌథి వేసిన బంతిని

టీమ్ సౌథి వేసిన బంతిని

టీమ్ సౌథి వేసిన బంతిని ఆసీస్ ఓపెనర్ జోయ్ బర్న్స్‌ స్ట్రయిట్ డ్రైవ్‌గా ఆడాడు. దీంతో బంతిని అందుకొని టిమ్ సౌథీ వికెట్లకు విసిరాడు. అ బంతి నేరుగా బర్న్స్‌ తలకు తగిలేలా దూసుకుపోయింది. ఈ క్రమంలో అతడు గాయపడకుండా బ్యాట్‌ని అడ్డుగా పెట్టడంతో చేతి గ్లౌవ్స్‌కు తగిలింది.

అవతలి ఎండ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్

అవతలి ఎండ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్

ఈ సమయంలో అవతలి ఎండ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ కలగజేసుకుని త్రో వేయడం వల్లనే అతడి చేతికి తగిలిందని సౌథితో మాటల యుద్ధానికి దిగాడు. సౌథి స్పందిస్తూ అతడు వికెట్ల ముందు ఉన్నాడని బదులిచ్చాడు. దీంతో వార్నర్ మేట్ మంచి వ్యక్తిలా ప్రవర్తించు అని సౌథిని హెచ్చరించాడు.

అంపైర్‌ జోక్యం

ఇంతలోకి అంపైర్‌ జోక్యం చేసుకొని వార్నర్‌కు సర్దిచెప్పడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఆసీస్ ఆటగాడు లబుషేన్‌ (110 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

మూడో టెస్టు సెంచరీ

మూడో టెస్టు సెంచరీ

లబుషేన్‌ వరుసగా మూడో టెస్టు సెంచరీ బాదడం విశేషం. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ లబుషేన్‌ సెంచరీలు బాదాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌ జో బర్న్స్‌ (9) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (43)తో కలిసి లబుషేన్‌ పరిస్థితిని చక్కదిద్దాడు. అనంతరం క్రీజులోకి దిగిన స్టీవ్‌ స్మిత్‌ (43) కూడా ఫర్వాలేదనిపించడంతో ఆస్ట్రేలియా తొలిరోజు మెరుగైన స్థితిలో నిలిచింది.

Story first published: Friday, December 13, 2019, 12:32 [IST]
Other articles published on Dec 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X