న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WATCH: విరాట్ కోహ్లీ 'నోట్‌బుక్' సెలబ్రేషన్ వీడియోని చూశారా?

India vs West Indies 1st T20 : Virat Kohli's 'Notebook' Celebration || Oneindia Telugu
WATCH: Virat Kohlis notebook celebration after hitting Kesrick Williams for a six

హైదరాబాద్: తన బ్యాట్‌తో పరుగుల వరద పారించి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిత్యం వార్తల్లో నిలవాలని కోరుకుంటాడు. అయితే, హైదరాబాద్‌ వేదికగా శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. కోహ్లీ తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చాడు.

208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు.

రూ. 26 లక్షలు పలికిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే 'జెర్సీ'రూ. 26 లక్షలు పలికిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే 'జెర్సీ'

ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడు. సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లీ అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ కూడా

ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ జేబులోంచి బుక్‌ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్‌ అనంతరం కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ.. బుక్‌ తీసి టిక్‌ కొట్టినట్లు సెలబ్రేషన్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోహ్లీ 94 నాటౌట్

కోహ్లీ 94 నాటౌట్

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది.

1-0 ఆధిక్యంలో టీమిండియా

ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులతో పాటు అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కిపైగా స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 68 ఇన్నింగ్స్‌లాడిన కోహ్లీ 23 సార్లు 50కిపైగా స్కోరు చేశాడు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఆ తర్వాతి స్థానంలో రోహిత్‌ శర్మ (22) కొనసాగుతున్నాడు. దీంతో పాటు కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక ‘మ్యాన్‌ అఫ్‌ ది మ్యాచ్‌'లు గెలుచుకున్న ఆటగాడిగా అఫ్గాన్‌ ఆటగాడు మహ్మద్‌ నబీ (12 సార్లు) రికార్డును సమం చేశాడు. ఆ తర్వాతి స్థానంలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిదీ (11) ఉన్నాడు.

Story first published: Saturday, December 7, 2019, 12:44 [IST]
Other articles published on Dec 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X