న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ కవర్ డ్రైవ్‌ని చప్పట్లతో అభినందించిన బంగ్లా బౌలర్ (వీడియో)

IND vs BAN,2nd Test : Virat Kohli's Glorious Cover Drive Gets An Applause From Bangla Bowler
Watch: Virat Kohli draws applause from Bangladesh bowler after glorious cover drive

హైదరాబాద్: కవర్ డ్రైవ్‌లకు విరాట్ కోహ్లీ పెట్టింది పేరు. సొగసైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అభిమానులు ముద్దుగా కోహ్లీని కవర్‌ డ్రైవ్‌ స్పెషలిస్ట్‌ అని కూడా పిలుచుకంటారు. విరాట్ కోహ్లీ కవర్‌ డ్రైవ్‌లను మాజీ క్రికెట్ దిగ్గజాలు సైతం ఎన్నో సార్లు మెచ్చుకున్నారు.

తాజాగా, ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి పింక్ బాల్ టెస్ట్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా చక్కటి కవర్ డ్రైవ్‌లతో అభిమానులకు కనువిందు చేశాడు. చారిత్రాత్మక తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరిన వేళ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

1
46120

పింక్ బాల్ టెస్ట్, డే2: పాంటింగ్ సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టేనా?పింక్ బాల్ టెస్ట్, డే2: పాంటింగ్ సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టేనా?

ఫ్లడ్‌లైట్ల వెలుతురులో

ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆచితూచి ఆడుతూ పుజారాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. పుజారా(105 బంతుల్లో 55; 8 ఫోర్లు)తో కలిసి విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బంగ్లా పేసర్ హుస్సేన్‌ బౌలింగ్‌లో చక్కని టైమింగ్‌తో క్లాసిక్‌ కవర్‌ డ్రైవ్‌తో బౌండరీ బాదిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

బంగ్లా బౌలర్ సైతం చప్పట్లు

బంగ్లా బౌలర్ సైతం చప్పట్లు

ఆ బంతి సంధించిన హుస్సేన్‌ సైతం విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్‌కు మంత్రముగ్ధుడవడంతో పాటు చప్పట్లతో అభినందించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

106 పరుగులకే బంగ్లా ఆలౌట్

106 పరుగులకే బంగ్లా ఆలౌట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ భారత పేసర్లు ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), షమీ (2/36) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మొదటి ఇన్నిగ్స్ ప్రారంభించిన టీమిండియాలో ఓపెనర్ రోహిత్ శర్మ(21), మయాంక్ అగర్వాల్(14)లు నిరాశ పరిచారు.

Story first published: Saturday, November 23, 2019, 13:36 [IST]
Other articles published on Nov 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X