న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంఫైర్ లేట్ నిర్ణయం: నిరాశగా పెవిలియన్‌కు చేరిన బ్యాట్స్‌మన్ (వీడియో)

Watch: Umpires Delayed Decision Bemuses Vidarbha Captain Faiz Fazal

హైదరాబాద్: ఓ దేశవాళీ మ్యాచ్‌లో అంఫైర్ సీకే నందన్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరానీ కప్‌లో భాగంగా విదర్భ-రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ అంపైర్‌ లేట్ నిర్ణయానికి బలయ్యాడు.

<strong>శ్రీలంకతో తొలి టెస్టు: కపిల్ రికార్డుని అధిగమించిన డేల్ స్టెయిన్</strong>శ్రీలంకతో తొలి టెస్టు: కపిల్ రికార్డుని అధిగమించిన డేల్ స్టెయిన్

ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో

ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో

వివరాల్లోకి వెళితే.... విదర్భ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో రెస్టాఫ్ ఇండియా స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన బంతిని ఫజల్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి బ్యాట్‌కి అందకుండా నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో.. ఔట్ కోసం రెస్టాఫ్ ఇండియా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. తొలుత ఆ ఆప్పీల్‌ను ఫీల్డ్ అంపైర్ నందన్ తిరస్కరించాడు.

ఫీల్డ్ అంపైర్‌‌తో కన్ఫర్మ్ చేసుకుని

ఫీల్డ్ అంపైర్‌‌తో కన్ఫర్మ్ చేసుకుని

దీంతో ఆటగాళ్లు తమతమ స్థానాలకు వెళుతుండగా నందన్‌ మరో ఫీల్డ్ అంపైర్‌‌తో కన్ఫర్మ్ చేసుకుని ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. తొలుత నాటౌట్ అని నిరాశకి గురైన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా..

విదర్భ కెప్టెన్ ఫజల్ అసహనంతో కాసేపు క్రీజులోనే ఉండిపోయి అనంతరం పెవిలియన్‌కు చేరాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 'అంపైర్ నిద్రపోయావా ఏంటి‌' అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా..

మరొక నెటిజన్ ‘అంపైర్లకు కూడా ఎప్పటికప్పుడు క్లాస్‌లు, పరీక్షలు పెట్టాలి' అంటూ కామెంట్ పెట్టాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన విదర్భ

తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన విదర్భ

మరోవైపు ఈ మ్యాచ్‌లో ఫజల్ సెంచరీతో రాణించడంతో విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో రాహుల్ చాహర్ 112 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక, మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 102/2 పరుగులతో నిలిచింది. క్రీజులో విహారి(40), రహానే(25 నాటౌట్) పరుగులతో ఉన్నారు.

Story first published: Friday, February 15, 2019, 13:44 [IST]
Other articles published on Feb 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X