నువ్వు తోపు బాసు.. నీ బౌలింగ్‌కు స్టంప్ గాల్లో పల్టీలు కొట్టి మరి నిలబడింది! (వీడియో)

న్యూఢిల్లీ: బౌలర్ల అద్భుత బంతులకు బ్యాట్స్‌మెన్ క్లీన్ బౌల్డ్ కావడం.. మిడిల్ వికెట్ ఎగరడం.. స్టంప్స్ విరగడం వంటివి చాలా చూశాం. బ్యాట్స్‌మెన్ బిత్తరపోయేలా ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్ బంతులకు క్లీన్ బౌల్డ్ అయిన సందర్భాల గురించి విన్నాం. కానీ క్రికెట్ స్కాట్‌లాండ్ నిర్వహిస్తున్న టీ20 బ్లిట్జ్ టోర్నీలో ఓ బౌలర్ చేసిన క్లీన్ బౌల్డ్ క్రికెట్ చరిత్రలోనే ఇప్పటి వరకు కని, విని ఎరగని రీతిలో ఉంది.

సదరు బౌలర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతి బ్యాట్స్‌మన్ లెంగ్ స్టంప్స్ ఎగరగొట్టింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ స్టంప్ గాల్లో నాలుగు, ఐదు పల్టీలు కొట్టి మరి కింద పడకుండా మైదానానికి గుచ్చుకుంది. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్.. 'వాటే సీన్.. వికెట్ పల్టీలు కొట్టి నిలబడడమా'అనే క్యాప్షన్‌తో ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్ అయింది. 'నువ్వుతోపు బౌలర్ బాసు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ టీ20 బ్లిట్జ్ లీగ్‌ సెప్టెంబర్‌ 13న ప్రారంభం కాగా.. కాలెడోనియన్ హైలాండర్స్, ఈస్టర్న్ నైట్స్, వెస్ట్రన్ వారియర్స్ మొత్తం మూడు జట్లు తలపడుతున్నాయి. ఈ లీగ్‌లో భాగంగా హైలాండర్స్, ఈస్టర్న్ నైట్స్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఈ సూపర్ సన్నివేశం చోటుచేసుకుంది. ఈస్టర్న్ నైట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా హైలాండర్స్ బౌలర్ కామెరాన్ వేసిన 8 ఓవర్ మూడో బంతిని బ్యాట్స్‌మన్ హైర్స్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ బంతి మిస్సై అతని లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. దీంతో హైర్స్(63) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ఈస్టర్న్ నైట్స్ 11 రన్స్‌తో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం హైలాండర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 187 రన్స్ చేసి ఓటమిపాలైంది.

ఐపీఎల్‌లో ఈ చెత్త రికార్డు తెలుసా..? ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్న బౌలర్!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 15, 2020, 18:23 [IST]
Other articles published on Sep 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X