న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓ చక్కటి గూగ్లీతో కోహ్లీని పెవిలియన్‌కి పంపిన గోపాల్ (వీడియో)

Watch: Shreyas Gopal Bamboozles Virat Kohli With A Beauty

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. అటు కెప్టెన్‌తో పాటు ఇటు జట్టులోని ఆటగాళ్లు కూడా క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తోంది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరు కూడా చర్ఛనీయాంశమవుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తప్పిదాలతో ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్‌లలోనూ వైఫల్యాన్ని చవి చూసింది. టోర్నీలో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ కవర్‌ డ్రైవ్‌ ఆడబోయిన ఔటయ్యాడు. రాజస్థాన్ బౌలర్ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో ఓ చక్కని గూగ్లీకి కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు.

గూగ్లీకి ఔటైన కోహ్లీ

ఏడో ఓవర్ తొలి బంతిని డిఫెన్స్ చేయడానికి కోహ్లీ ప్రయత్నించగా బ్యాట్ ఎడ్జ్‌కి తాకింది. ఈ క్రమంలో ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. ఆ తర్వాత తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని కోహ్లీ తర్వాతి బంతికే ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన డివిలియర్స్

రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరిన డివిలియర్స్

ఆ తర్వాత శ్రేయాస్ గోపాల్‌ తన తర్వాతి ఓవర్లోనే మళ్లీ బెంగళూరుకు షాకిచ్చాడు. ప్రమాదకర డివిలియర్స్‌(13)ని రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఆర్సీబీ హిట్టర్ హెట్‌మయర్‌ (1)నూ ఔట్‌ చేయడంతో బెంగళూరు 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం

7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్థాన్ జట్టులో జోస్ బట్లర్ (59) హాఫ్ సెంచరీతో రాణించగా స్టీవ్ స్మిత్ (38), రాహుల్ త్రిపాఠి(34) పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Wednesday, April 3, 2019, 15:22 [IST]
Other articles published on Apr 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X