న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ సీజన్‌లో 2వ బౌలర్: శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ వీడియో చూశారా?

WATCH: Shreyas Gopal bags maiden hat-trick in IPL, becomes 2nd bowler to achieve feat this season

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా శ్రేయాస్ గోపాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ ఆల్ రౌండర్ శామ్ కుర్రన్ హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ గోపాల్ బెంగళూరు కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్ వికెట్లను తీసి హ్యాట్రిక్ సాధించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు జట్టు 5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డివిలియర్స్ తొలి ఓవర్‌కు 23 పరుగులు రాబట్టారు.

మొదటి ఓవర్‌లో 23 పరుగులు రాబట్టిన ఆర్సీబీ ఓపెనర్లు

మొదటి ఓవర్‌లో 23 పరుగులు రాబట్టిన ఆర్సీబీ ఓపెనర్లు

విరాట్ కోహ్లీ 7 బంతుల్లో 25(ఫోర్, 3 సిక్సులు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడగా... మరో ఓపెనర్ ఏబీ డివిలియర్స్‌ 4 బంతుల్లో 10 (2ఫోర్లు) ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌ వేసిన రాజస్థాన్‌ బౌలర్‌ శ్రేయాస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. చివరి మూడు బంతుల్లో కోహ్లీ, డివిలియర్స్‌, మార్కస్‌ స్టొయినిస్‌ (0)లను ఔట్‌ చేశాడు.

శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు దూకుడుగా ఆడే క్రమంలో వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. అనంతరం 63 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మళ్లీ పడడంతో.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా, శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Wednesday, May 1, 2019, 15:27 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X