
రెండో బంతిని బౌన్సర్ రూపంలో
ఆ ఓవర్‌లో రెండో బంతిని బౌన్సర్ రూపంలో హార్దిక్ పాండ్యా సంధించగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. అక్కడ ఎవరూ ఫీల్డర్లు లేకపోవడంతో సింగిల్ పూర్తి చేసుకున్న టేలర్.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా స్వ్కేర్ లెగ్ నుంచి అప్పటికే వేగంగా పరుగెత్తుకొచ్చిన శిఖర్ ధావన్ బంతిని అందుకున్నాడు.

తత్తరపాటులో ధావన్ పిచ్ మధ్యలో
అదే సమయంలో ధావన్ తత్తరపాటులో అటు బౌలర్‌కి ఇటు వికెట్ కీపర్‌కి కాకుండా పిచ్ మధ్యలో విసిరాడు. దీనిని అదునుగా భావించిన రాస్ టేలర్ రెండో పరుగుని కూడా పూర్తి చేశాడు. తన బౌలింగ్‌లో అదనంగా మరో పరుగు రావడంతో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా... ధావన్ త్రోపై మండిపడ్డాడు.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లలో రాస్ టేలర్ (93), టామ్ లాథమ్ (51) రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. దీంతో పర్యాటక జట్టైన టీమిండియాకు 244 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

మూడు వికెట్లు తీసిన షమీ
చివర్లో ఒత్తిడికి గురైన ఆ జట్టు ఆఖర్లో వరుసగా వికెట్లు సమర్పించుకుంది. దీంతో 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.