న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: గాయంతో సైనీ ఔట్.. బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ (వీడియో)

Watch Rohit Sharma steps in to bowl after injury concerns for Navdeep Saini
Ind vs Aus 4th Test: Rohit Sharma Bowls Medium Pace After Navdeep Saini Leaves Field Injured

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే జట్టు గాయాలతో సతమతమవుతుండగా.. మరో ఆటగాడు ఆ జాబితాలో చేరాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పేసర్‌ నవ్‌దీప్‌ సైని గాయపడ్డాడు. అతను 36వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు. దీంతో సైని మైదానం వీడాడు.

ఈ ఓవర్‌లో 5 బంతులు మాత్రమే వేయగా.. చివరి బంతిని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి చేశాడు. అతను వేసిన ఆఖరి బంతికి లబుషేన్ సింగిల్ తీశాడు. అయితే ఆఫ్ స్పిన్నర్ అయిన రోహిత్ శర్మ.. ఈ బంతిని మీడియం పేస్‌గా వేయడం అందర్ని ఆకట్టుకుంది. ఇక ఆఫ్‌ స్పిన్నర్‌గా‌ ఇప్పటి వరకు సంప్రదాయక ఫార్మాట్‌లో రెండు వికెట్లు, వన్డేల్లో 8, టీ20ల్లో ఓ వికెట్ తీశాడు. ఇక రోహిత్ శర్మ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హిట్ మ్యాన్ బంతితో కూడా రాణిస్తాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి కొస్తే.. యవ పేసర్లతో బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభాన్ని అందుకుంది. ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), మార్కస్ హ్యారిస్(5)లను పెవిలియన్ చేర్చింది. రోహిత్ శర్మ సూపర్ క్యాచ్‌తో వార్నర్‌ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేయగా.. మార్కస్ హ్యారిస్‌ను శార్దుల్ ఠాకుర్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లబుషేన్, స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అరంగేట్ర స్పిన్నర్ సుంధర్ విడదీశాడు. స్మిత్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి టెస్ట్ వికెట్ల ఖాతా తెరిచాడు.

ఆ తర్వా లబుషేన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు చేజార్చి మూల్యం చెల్లించుకున్నారు. ఈ అవకాశాలను అందుకున్న లబుషేన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని..సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 62 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్‌(97 బ్యాటింగ్)తో పాటు మాథ్యూ వేడ్(38 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, January 15, 2021, 12:25 [IST]
Other articles published on Jan 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X