స్టేడియం బయటపడ్డ బంతి: రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ భారీ సిక్సర్ (వీడియో)

Posted By:
Watch: Rohit Sharma Hits Rabada Out Of The Ground In Style

హైదరాబాద్: వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలతో హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలో అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో పాటు ఆరు వన్డేల సిరిస్‌లో తొలి నాలుగు వన్డేల్లో పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు.

వాలెంటైన్స్‌ డే: భార్యకు రోహిత్ శర్మ ఇచ్చిన గిఫ్ట్ ఇదే

అయితే పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో అనూహ్యంగా పుంజుకున్న రోహిత్ శర్మ అలవోకగా ఫోర్లు, సిక్సర్లతో సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 17వ సెంచరీ. సఫారీ పర్యటనలో రోహిత్‌ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది రబాడనే.

ఈ సుదీర్ఘమైన సిరిస్‌లో రోహిత్ శర్మ... రబాడ బౌలింగ్‌లో ఇప్పటివరకు ఆరు సార్లు ఔటయ్యాడు. అయితే, ఐదో వన్డేలో మాత్రం రబాడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. రబాడ బౌలింగ్‌లో రోహిత్ సర్మ బాదిన ఓ భారీ సిక్సర్ ఏకంగా స్టేడియం అవతల పడింది.

విరుచుకుపడుతున్న నెటిజన్లు: రోహిత్.. నీ సెంచరీ కోసం ఇంకెంత మందిని బలి చేస్తావ్?

ఐదో వన్డే ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఇరు జట్ల మధ్య ఈ సిరిస్‌లో చివరి వన్డే మంగళవారం సెంచూరియన్ వేదికగా జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, February 14, 2018, 14:45 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి