న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా రెండు క్యాచ్‌లు వదిలేసినా: అంతే ప్రశాంతంగా ధోని (వీడియో)

By Nageshwara Rao
 WATCH: Ravindra Jadejas unbelievable double-blip on field during CSK versus KKR

హైదరాబాద్: మ్యాచ్ ఏదైనా సరే... మైదానంలో ధోని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు. బౌలర్లు వికెట్లు తీసినా.. ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లు పట్టినా.. చివరికి మ్యాచ్ ఓడినా.. గెలిచినా తాను మాత్రం ఒకే విధంగా కనిపిస్తాడు. మైదానంలో తోటి ఆటగాళ్లతో సంబరాలు చేసుకోవడానికి ధోని ఎప్పుడూ దూరమే.

అందుకే ధోనీని అభిమానులు మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు కోల్‌కతాలో అనూహ్యాంగా బ్రేక్‌ వేసింది. కోల్‌కతా బౌలర్లు క్రమంగా కట్టుదిట్టంగా బంతులు విసరడంతో చెన్నై భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.

 తోలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన కోల్‌కతా

తోలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయిన కోల్‌కతా

దీంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177పరుగులు చేసింది. అనంతరం 178పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన కోల్‌కతా తొలి ఓవర్‌లోనే క్రిస్ లిన్‌ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత ఆసిఫ్‌ వేసిన మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ వరుసగా ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా నేలపాలు చేశాడు.

నేరుగా వెళ్లి జడేజా చేతిలో పడిన బంతి

చెన్నై బౌలర్ ఆసీఫ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని మరో భారీ షాట్ ఆడగా అది నేరుగా వెళ్లి జడేజా చేతిలో పడింది. ఎంతో సులువైన క్యాచ్‌ను జడేజా వదిలేశాడు. అనంతరం జడేజా ఫీల్డింగ్ చేస్తున్న దిశగానే నరైన్ తర్వాతి బంతిని మరో షాట్ బాదాడు. తన మీదుగా వెళ్తున్న బంతిని జడేజా గాల్లోకి ఎగిరి అందుకోబోయి మరోసారి జారవిడిచాడు.

స్కోరుబోర్డుని పరిగెత్తించిన నరైన్

స్కోరుబోర్డుని పరిగెత్తించిన నరైన్

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నరైన్‌(32; 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) స్కోరుబోర్డును ముందుండి నడిపించి కోల్‌కతాకు మంచి ఆరంభాన్నిచ్చాడు. నరైన్ వ్యక్తిగత స్కోరు 6 వద్ద ఉన్నప్పుడు జడ్డూ వరుసగా రెండు క్యాచ్‌లు వదిలేయడం... గెలిచే అవకాశాలున్న మ్యాచ్‌ను చెన్నై చేజార్చుకుందని అభిమానులు అంటున్నారు.

జడేజాను మందలించని ధోని

జడేజాను మందలించని ధోని

ఈ రెండు క్యాచ్‌లను వదిలేసిన జడేజాను ధోనీ ఏమాత్రం మందలించలేదు. ఎలాంటి ఆగ్రహానికి లోనుకాకుండా ప్రశాంతంగానే తన పని తాను చేసుకుపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన జడేజా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినా వరుసగా ఎనిమిది మ్యాచ్‌లాడాడు. ధోనీ కారణంగానే జడేజా జట్టులో ఉంటున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

Story first published: Friday, May 4, 2018, 18:21 [IST]
Other articles published on May 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X